Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో సంజు శాంసన్‌ను పక్కనపెట్టి వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడించడం తన కెరీర్లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకున్న రాత్రి తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చిందని.. అస్సలు నిద్రపట్టలేదని ఆయన తెలిపారు. సంజు శాంసన్‌తో తాను స్వయంగా ఈ విషయం గురించి మాట్లాడానని, జట్టు అవసరాలరీత్యా ఆ సమయంలో వైభవ్ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గంభీర్ పేర్కొన్నారు.
వెస్టిండీస్‌తో జరిగిన అండర్-19 పర్ఫామెన్స్, ఐపీఎల్లో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ అప్పట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు సంజు శాంసన్ కొన్ని ఇన్నింగ్స్‌ల్లో నిలకడగా రాణించలేకపోవడంతో, ఓపెనింగ్ స్థానంలో వేగంగా పరుగులు సాధించే ఆటగాడి అవసరం జట్టుకు ఎంతైనా ఉండేది. అయితే టోర్నమెంట్లో అప్పటి వరకు అద్భుతంగా రాణించిన ఆటగాడిని కేవలం మూడు, నాలుగు మ్యాచ్‌ల తర్వాత పక్కనపెట్టడం సులభం కాదని గంభీర్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ.. సోషల్ మీడియా ఒత్తిడికి , బయట జరిగే చర్చలకు తలొగ్గి తుది జట్టును ఎంపిక చేయలేమని, దేశానికి ఏది సరైనదో అదే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
మరోవైపు.. న్యూజిలాండ్‌తో త్వరలో ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌కు భారత్ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లకు వైట్ బాల్ క్రికెట్ నుంచి తగిన విశ్రాంతి ఇవ్వాలని కోచింగ్ సిబ్బంది భావిస్తోంది. పొట్టి ఫార్మాట్ నుంచి వన్డేలు, టెస్టులకు మారడం అంత సులభం కానందున, టెస్టు మ్యాచ్‌లకు ముందు బ్యాటర్లకు తగిన బ్రేక్ ఇవ్వడం ద్వారా వారిని మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయవచ్చని గంభీర్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి జాతీయ జట్టు ఎంపికలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తున్నప్పటికీ, ఆటగాళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!