AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి ఏ4 మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియకు గడువు ముగిసింది. ఇకపై గడువు పొడిగించకూడదని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రెన్యువల్ ప్రక్రియలో భాగంగా ఇవాళ అర్ధరాత్రి వరకు చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. గడువులోగా రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (RET) మొత్తాన్ని 100 శాతం చెల్లించిన షాపులను మాత్రమే రెన్యువల్‌కు పరిగణించనున్నారు.
3,650 షాపులు రెన్యువల్‌కు నోటిఫై
సెప్టెంబర్ 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపులను రెన్యువల్‌కు నోటిఫై చేశారు. వీటిలో 3,236 షాపులు రెన్యువల్‌కు ముందుకు వచ్చాయి. మొత్తం 2,906 షాపులకు సంబంధించి చెల్లింపులు నమోదయ్యాయి. ఇందులో 2,873 షాపులు రెన్యువల్ RET మొత్తాన్ని పూర్తిగా చెల్లించగా, మరో 33 షాపులు పాక్షికంగా చెల్లింపులు చేశాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా నోటిఫై చేసిన మొత్తం షాపుల్లో 88.7 శాతం రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. దాదాపు 80 శాతం షాపులకు సంబంధించి చెల్లింపులు నమోదయ్యాయి. చెల్లింపుల శాతంలో తూర్పుగోదావరి జిల్లా 97.1 శాతంతో ముందంజలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 94.7 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 91.8 శాతం, కోనసీమ జిల్లాలో 91.1 శాతం, ఏలూరు జిల్లాలో 91 శాతం చెల్లింపులు నమోదయ్యాయి. మరోవైపు గుంటూరు జిల్లాలో 64.5 శాతం, బాపట్ల జిల్లాలో 68.8 శాతం, విశాఖపట్నం జిల్లాలో 69 శాతం చెల్లింపులు నమోదయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు రెన్యువల్ RETలో 100 శాతం చెల్లింపులు పూర్తి చేసిన షాపులను రెన్యువల్‌కు పరిగణించనున్నారు.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
మిగిలిన షాపులకు తాజా దరఖాస్తులు
రెన్యువల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిపోయే ఏ4 మద్యం షాపులతో పాటు ఇప్పటివరకు నోటిఫై చేయని ఏ4 షాపులకు తాజా దరఖాస్తుల ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మరోవైపు.. తాజా దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 2న దరఖాస్తులను పరిశీలిస్తారు. అనంతరం అక్టోబర్ 3న లాటరీ నిర్వహించి ఏ4 మద్యం షాపులను కేటాయించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తదుపరి ప్రక్రియను కొనసాగించనుంది.
తాజావార్తలు
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..