కాన్పూర్ టెస్టులో పుంజుకున్న న్యూజిలాండ్

కాన్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సులో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. క్రీజులో విల్ యంగ్ (75), లాథమ్ (50) ఉన్నారు. వీరిద్దరూ అర్థసెంచరీలు చేసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 57 ఓవర్లు వేసినా టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే కివీస్ 216 పరుగులు వెనుకబడి ఉంది.

Read Also: పాక్ మ్యాచ్ కు ముందే భారత్ భయపడుతోంది

మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 345 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 258/4తో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ హైలెట్‌గా నిలిచాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కాన్పూర్ స్టేడియంలో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. గతంలో గుండప్ప విశ్వనాథన్ కూడా తొలి టెస్టులోనే సెంచరీ పూర్తి చేశాడు. కాగా మూడోరోజు తొలి సెషన్‌లో భారత్ బౌలర్లు వికెట్ సాధించకపోతే ఈ టెస్టులో న్యూజిలాండ్ ఆధిక్యం సంపాదించే అవకాశాలున్నాయి.

Related Articles

Latest Articles