Virender Sehwag: మరో రెండు రోజుల్లో ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9వ తేదీన దుబాయ్ వేదికగా ఆఫ్గానిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ స్టార్ట్ కానుంది. అయితే, భారత్–పాకిస్తాన్ పోరు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 6 నెలల తరువాత ఈ చిరకాల ప్రత్యర్థులు మైదానంలో తలపడనున్నాయి. సెప్టెంబర్ 14న జరగనున్న భారత్–పాక్ పోరు కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నాడు.
Read Also: Bill Gates: ఏఐ వల్ల మీ ఉద్యోగాలకు ముప్పు లేదు..? ఎందుకో వివరణ ఇచ్చిన బిల్ గేట్స్..!
అయితే, పాకిస్తాన్‌పై ఓడిపోయిన ప్రతీసారి నేను చాలా నిరాశ చెందేవాడిని.. దాంతో ఏకాగ్రత కోల్పోవడంతో.. ప్రతిదీ కోల్పోయినట్లు అనిపించేదని భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తెలిపారు. పాక్ తో తలపడే ప్రతి మ్యాచ్‌లో గెలవాలన్న పట్టుదల తనలో చాలా ఉండేది.. ముఖ్యంగా టెస్టుల్లో పాక్ బౌలర్లను చిత్తు చేసేవాడిని అని పేర్కొన్నారు. తన తొలి ట్రిపుల్ సెంచరీని కూడా దాయాది జట్టుపైనే నమోదు చేశానని వీరూ గుర్తు చేసుకున్నాడు. అలాగే, 2008లో కరాచీలో జరిగిన వన్డే మ్యాచ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.. 300 పరుగుల టార్గెట్ ని ఛేదించే క్రమంలో కేవలం 95 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 119 రన్స్ సాధించి టీమిండియాకు ఘన విజయం అందించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అయితే, ఆ రోజు నేను ఉపవాసంలో ఉండి ఖాళీ కడుపుతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.. కానీ, ఆ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడం ద్వారా నా ఆకలిని తీర్చుకున్నాను అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు.