Boycott Asia Cup: ఆసియా కప్ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు రెండుసార్లు తలపడబోతున్నాయి. సెప్టెంబర్ 14, 21వ తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆసియా కప్ హోస్ట్ హక్కులు టీమిండియావే అయినప్పటికీ, యూఏఈ వేదికగానే మ్యాచులు నిర్వహించనున్నట్లు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు అభిమానుల కోపానికి కారణమైంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌తో క్రికెట్ ఆడకూడదని పలువురు మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ వ్యాఖ్యానించారు. తాజాగా, వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ భారత్ ఛాంపియన్స్-పాక్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్‌ను రద్దు చేసుకున్నారు. ఇలాంటి సమయంలో ఆసియా కప్‌లో భారత్- పాక్ మ్యాచ్‌లు నిర్వహించాలనుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Read Also: Tirumala: శ్రీవారికి 121 కేజీల బంగారం విరాళం.. ఆజ్ఞాత భక్తుడి కండిషన్ ఏంటో చెప్పిన సీఎం!
ఇక, భారత్-పాక్ మ్యాచ్‌లను బహిష్కరించాలని సోషల్ మీడియాలో అభిమానులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. “బాయ్‌కాట్ ఆసియా కప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే, కార్గిల్ విజయ్ దివస్ రోజునే ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించడం దారుణం.. సెప్టెంబర్ 14న భారత్- పాక్ మ్యాచ్ జరగడం పరోక్షంగా పీసీబీకి నిధులను సమకూర్చడమే.. అదే డబ్బును మన మీదనే దాడి చేయడానికి ఉపయోగిస్తారంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి, “భారత ఆర్మీ పట్ల గౌరవం ఉంటే పాక్‌తో మ్యాచ్‌లను ఆడకూడదు.. కుదిరితే ఆసియా కప్‌ను బహిష్కరించండి అంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఒకవైపు, ఉగ్రవాదంపై ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు, పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ రెడీ కావడం.. అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: SunPictures : సెన్సార్ బోర్డ్ పై హైకోర్టుకు సన్ పిచర్స్.. ఎన్నడా ఇది!
మరోవైపు, పాకిస్తాన్ తో అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని భారత ప్రభుత్వం చూస్తుంటే.. బీసీసీఐ మాత్రం మ్యాచ్ లు ఆడటం అభిమానుల కోపానికి గురైతుంది. దాయాది దేశంతో క్రికెట్ ఆడేందుకు బీసీసీఐకి మనసెలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదం, ఆటలు కలిసి సాగలేవు అని పేర్కొంటున్నారు. దేశం కంటే క్రికెట్ ముఖ్యమా అని అడుగుతున్నారు. దేశ ప్రజల ప్రాణాల కన్నా క్రికెట్ ఇంపార్టెంట్ హా అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజల మనోభావాల కన్నా కాసుల కిక్కే బీసీసీఐకి తృప్తినిస్తుందా.. డబ్బుల కోసం బీసీసీఐ ఎంతకైనా దిగజారుతుందా అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.