సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలి. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, అమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి మిశ్రమ ఫలితాన్ని రాబట్టి ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిచ్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మించారు.
Also Read : HariHaraVeeraMallu : న్యూ వర్షన్ తో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న వీరమల్లు..
ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ నుండి A రేటింగ్ తో 16 సంవత్సరాల కంటే తక్కవ వయసు ఉన్న పిల్లలు చూడకూడదు అనే నిబంధనలతో సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ టీమ్. అదే సర్టిఫికెట్ తో సినిమా రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు రిలీజ్ అయినా వారానికి ఈ సినిమా సెన్సార్ చేసిన టీమ్ పై మద్రాస్ హై కోర్టుకు వెళ్ళింది. కూలీ సినిమాకు A సర్టిఫికెట్ ఎలా ఇస్తారు. గతంలో వచ్చిన బీస్ట్ , KGF సినిమాలకు U/A ఇచ్చారు. ఆ సినిమాలలో హింస, రక్తపాతం ఎక్కవుగా ఉంటుంది అయినా కూడా ఫ్యామీతో చూడొచ్చు అనెలా సర్టిఫై చేశారు. కానీ మా సినిమాలో వైలెన్స్ తక్కువ ఉన్న కూడా ఏ ఇచ్చారని, మా సినిమాకు కూడాU/A ఇవ్వండి అని కోర్ట్ కు వెళ్లారు. కాసేపు ఇదంతా పక్కన పెడితే.. సినిమా రిలీజ్ కు ముందుగానే సెన్సార్ చేసారు. మరి అప్పుడు ఏమి చేస్తారో సదరు మేకర్స్. ఇంకో రెండు మూడు రోజులు ఆగితే సినిమా థియేటర్స్ లో ఉండదు ఇప్పుడు ఈ కామెడీలు ఏంటని మెకర్స్ పై సోషల్ మిడియాలో కామెంట్స్ వినిపిస్తన్నాయి.