AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు మూడో రోజు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. మూడో రోజు సమావేశాల్లో పలు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. గూడూరు నియోజకవర్గంలోని యల్లసిరి కాల్వ పనులు, తిరుపతిలో టీడీఆర్ బాండ్ల వ్యవహారం, ఏలేరు కాల్వ బెడ్ రెగ్యులేటర్లు వంటి అంశాలు నేడు అసెంబ్లీలో చర్చకు రానున్నాయి.
అలాగే ఆళ్లగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, గృహాల మ్యాపింగ్‌లో సవరణకు అవకాశం, గ్రీన్ డేటా సెంటర్ విధానం వంటి అంశాలపై కూడా సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ప్రభుత్వ శాఖల్లో సాంకేతిక సిబ్బంది కొరత, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపైనా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో విద్య, సాగునీరు, పట్టణాభివృద్ధి, సాంకేతిక రంగం, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Also Read
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
మరోవైపు శాసనమండలి మూడో రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. మండలిలోనూ పలు ప్రజా సమస్యలపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, గృహాల మంజూరు, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళలు, నిరుద్యోగ యువతకు సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి. ఉన్నతి పథకం, గృహాల మంజూరు, ఆర్వో వాటర్ ప్లాంట్లు, స్త్రీ శక్తి పథకం వంటి అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్య పరిస్థితులు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి అంశాలపైనా మండలిలో చర్చ జరగనుంది.
అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం, పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా మార్చే చర్యలు, ఆక్వా కల్చర్ రంగంలో నెలకొన్న సంక్షోభం వంటి అంశాలు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావనకు రానున్నాయి. మూడో రోజు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం, ఉపాధి వంటి పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?