Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేశారు. కబడ్డీ విభాగంలో భారత పురుషులు, మహిళల జట్లు రెండు స్వర్ణ పతకాలను సాధించి చరిత్ర సృష్టించాయి. నేడు ఫైనల్ పోరులో భారత పురుషుల కబడ్డీ జట్టు పటిష్టమైన ఇరాన్ జట్టును 40-34 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో భారత పురుషుల జట్టుకు ఇది తొమ్మిదవ స్వర్ణ పతకం కావడం విశేషం. టోర్నమెంట్ ఆరంభం నుంచి అజేయంగా దూసుకెళ్లిన మన ఆటగాళ్లు ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
పురుషుల కంటే ముందే భారత మహిళల కబడ్డీ జట్టు కూడా అదరగొట్టింది. మహిళల విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత మహిళా జట్టు కూడా ఇరాన్‌పైనే 37-34 స్కోరుతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. తొలి అర్ధభాగంలో భారత్ స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకెళ్లినా, రెండో అర్ధభాగంలో ఇరాన్ క్రీడాకారిణులు గట్టి పోటీనిచ్చారు. అయినప్పటికీ భారత డిఫెన్స్ చివరి క్షణాల్లో ఒత్తిడిని జయించి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది.
Also Read
- AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
- Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
- Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
ఈ రెండు స్వర్ణ పతకాల విజయాలతో ఆసియా గేమ్స్ పతకాల పట్టికలో భారత్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. తాజా విజయాలతో కలిపి భారత్ ఇప్పటివరకు మొత్తం 28 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి.
అంతకుముందు రోజు మేరాథాన్ ఈవెంట్లో సావన్ బర్వాల్ రజత పతకం సాధించగా, మహిళల 50 మీటర్ల రైఫిల్ 3పీ ఈవెంట్లో భారత షూటర్ల జోడీ సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఇలా కబడ్డీతో పాటు వివిధ క్రీడాంశాలలో భారత్ సాధిస్తున్న వరుస విజయాలు దేశ క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవిగా నిలుస్తున్నాయి. ఆసియా క్రీడల్లో మన క్రీడాకారులు చూపుతున్న ఈ అద్భుతమైన ప్రతిభ దేశ యువతకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని ఇండియన్స్ కోరుతున్నారు.
తాజావార్తలు
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!