Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఏ వన్డే మ్యాచ్ జరిగినా..? ఏ వన్డే సిరీస్ వస్తున్నా..? వెంటనే రోహిత్ శర్మ కెరీర్‌తో పాటు.. విరాట్ కోహ్లీ ఫ్యూచర్‌పై కూడా చర్చ జరుగుతుంది.. ఇప్పుడు భారత్-వెస్టిండీస్ సిరీస్ ముందు కూడా మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది.. అయితే, తన భవిష్యత్‌పై సంచలన ప్రకటన చేశారు టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ.. 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్ తనకు భారత జట్టు తరఫున చివరి ప్రపంచకప్ అవుతుందని వెల్లడించాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారాయి.. ఇదే సమయంలో.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌ను నిరాశ పరిచే విధంగా ఉన్నాయి..
భారత్, వెస్టిండీస్ జట్లు మల్టీ ఫార్మాట్ వైట్‌బాల్ సిరీస్‌లో తలపడనున్నాయి. ఇందులో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి వన్డే సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో జరగనుంది. ఈ సిరీస్ ద్వారా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరోసారి వన్డేల్లో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు ఈ సిరీస్ కీలక సన్నాహకంగా మారనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ తన లక్ష్యాన్ని స్పష్టం చేశాడు. 50 ఓవర్ల ప్రపంచకప్‌లో ఉండే తీవ్రత మరే ఫార్మాట్లోనూ ఉండదని పేర్కొన్నాడు. ఒకే రోజులో దాదాపు రెండున్నర టీ20 మ్యాచ్‌లు ఆడినంత తీవ్రతతో, సుదీర్ఘ టోర్నీలో సుమారు పది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని వివరించాడు.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
విదేశీ పరిస్థితుల్లో జరిగే ప్రపంచకప్ ఆటగాళ్ల నుంచి మరింత ఎఫర్ట్ కోరుకుంటుందని కోహ్లీ చెప్పాడు. 2027 ప్రపంచకప్ తనకు భారత్ తరఫున చివరిదని, అందుకే తనకు అదే పెద్ద ప్రేరణగా నిలుస్తోందని పేర్కొన్నాడు. ప్రపంచకప్ గెలవడమే తన ప్రధాన లక్ష్యమని, అందుకోసం తనవంతుగా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు.. ఇక భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే సెప్టెంబర్ 27న జరగనుండగా.. రెండో వన్డే సెప్టెంబర్ 30న, మూడో వన్డే అక్టోబర్ 3న జరగనున్నాయి. ఈ సిరీస్‌లో భారత్ మంచి ఆరంభం కోసం ప్రయత్నించనుంది.
మరోవైపు వెస్టిండీస్‌కు కూడా ఈ సిరీస్ కీలకమే. 2027 ప్రారంభంలో వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉండటంతో, ఆ జట్టు కూడా తమ ఆటతీరును మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. దీంతో భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ఇరు జట్లకు ప్రపంచకప్ సన్నాహకంగా మారనుంది. ఏదేమైనా.. కింగ్ కోహ్లీ ఉన్నాడంటే.. టీమిండియాకు ఉన్న ధైర్యమే వేరు.. ఫ్యాన్స్‌లో ఉండే నమ్మకం కూడా అలాంటిదే.. ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన కింగ్ కోహ్లీ.. 2027 వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరం అవుతారంటేనే.. ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయం..
తాజావార్తలు
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
-
Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
-
Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
-
UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
-
Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?