Pakistan Cricket: టీ20 ప్రపంచకప్ లీగ్ దశల్లోనే నిష్క్రమించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై సొంత దేశ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. మాజీ క్రికెటర్లు ఒకడుగు ముందకేసి మొత్తం టీంని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో లీగ్ దశలోనే ఇంటి దారి పట్టడంపై అక్కడి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు భారత్ కప్ కొట్టడంతో వారి ఆగ్రహం మరింత ఎక్కువ అవుతోంది. అమెరికా వంటి పసికూన జట్టుపై ఓడిపోవడంతో పాటు భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
Read Also: Pawan Kalyan: మనం ఓజీ అంటే జనం క్యాజీ అంటారు.. సినిమాలపై పవన్ కీలక వ్యాఖ్యలు
టీ 20 ప్రపంచకప్ ముందు పాక్ క్రికెట్ టీం ఆర్మీ ట్రైనింగ్‌లో తెగ కష్టపడింది. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఓటమి అనంతరం మీ ఆర్మీ ట్రైనింగ్ ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పాక్ క్రికెటర్ల సరికొత్త ట్రైనింగ్‌తో ముందుకు వచ్చారు. పాకిస్తాన్‌కి వచ్చిన కొన్ని రోజుల తర్వాత లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో పాక్ క్రికెటర్లు ఫిల్డింగ్ శిక్షణ తీసుకుంటున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌తో సహా కొంత మంది ప్లేయర్లు క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
అయితే, ఇప్పుడు ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. పాకి క్రికెటర్లను ఉద్దేశిస్తూ ఫ్యాన్ ట్రోల్స్ చేస్తున్నారు. పాక్ క్రికెట్ టీంలో రాజకీయాల జరుగుతున్నాయని ఆ దేశంలో చర్చ నడుస్తోంది. బాబర్ అజామ్, షాహీన్ షా అఫ్రిదికి కెప్టెన్సీ విషయంలో విభేదాలు ఉన్నాయని, మరోవైపు కెప్టెన్సీకి తనను తీసుకోకపోవడంపై మహ్మద్ రిజ్వాన్ కూడా అసంతృప్తితో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
Imam-ul-Haq and others having special fielding drills with coach @Masroor173 in Pre Season Fitness Camp in Karachi pic.twitter.com/zL9qrwGVba
— Shahzaib Ali 🇵🇰 (@DSBcricket) July 2, 2024
https://twitter.com/Rajasthanii_Tau/status/1808391668023853341