సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్.. ఇప్పటికే ఎన్నో జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ఎందరో ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్‌తో ఉంటారు.. అక్షరాలు రెండే అయిన రెండు జీవితాలను ఏకం చేసే పవిత్ర బంధం.. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో జంటలు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు.. ఆ జంటలు ఎవరో ఒక్కసారి చూసేద్దాం..
నాగార్జున అమల..
వీరిద్దరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓ సినిమా సెట్ లో పరిచయమైన వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది.. 1992లో వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్దం, చినబాబు, శివ, నిర్ణయం లాంటి చిత్రాల్లో జంటగా నటించారు. అయితే నాగార్జునని పెళ్లాడిన తర్వాత అమల సినిమాలకు గుడ్ బై చెప్పింది…
శ్రీకాంత్-ఊహా..
1994లో ‘ఆమె’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె, ఆయనగారు లాంటి చిత్రాల్లో కలిసి నటించారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో జంటగా నటించారు.. ఆ తర్వాత మూడేళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు..
రాజశేఖర్-జీవిత..
టాలీవుడ్ హీరోల్లో రాజశేఖర్ అంటేనే ఓ స్పెషల్. రాజశేఖర్, జీవిత జంటగా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మొదట జీవితనే రాజశేఖర్‌కు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు..
మహేష్ బాబు – నమ్రత..
వంశీ చిత్రంలో మహేశ్ – నమ్రత కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్లపాటు సీక్రెట్‌గా తమ బంధాన్ని కొనసాగించారు. ఆ తర్వాత 2005 లో పెళ్లి తో ఒక్కటయ్యారు..
వీళ్ళే కాదు.. అల్లు అర్జున్-స్నేహ, రామ్ చరణ్-ఉపాసన,నాని-అంజనా యలవర్తి,నాగ చైతన్య-సమంత,వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి, ఇలా ఎంతో మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు..