Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- కాలేజీ వదిలాడు.. కానీ కలను కాదు
- 22 ఏళ్లకే బిలియనీర్‌గా మారిన కైవల్య వోహ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaivalya Vohra: ఒకప్పుడు బిలియనీర్ కావాలంటే దశాబ్దాల పాటు వ్యాపారం చేయాలి.. పెద్ద సంస్థలు నిర్మించాలి.. తరతరాలుగా వచ్చిన వ్యాపార సామ్రాజ్యం ఉండాలి అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒక గొప్ప ఆలోచన, దాన్ని అమలు చేసే ధైర్యం, టెక్నాలజీపై పట్టు ఉంటే చిన్న వయసులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్థాయికి ఎదగవచ్చని కొత్త తరం యువ పారిశ్రామికవేత్తలు నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు కైవల్య వోహ్రా. కేవలం 22 ఏళ్ల వయసులోనే భారతదేశపు అతి పిన్న వయస్కుడైన టెక్ బిలియనీర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన ప్రయాణం నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంతకీ మనోడి కథ ఏంటో మీకు తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉద్యోగం కోసం ఎదురుచూడలేదు..
సాధారణంగా 22 ఏళ్ల వయసులో చాలామంది భవిష్యత్ కోసం ఉద్యోగాల గురించి ఆలోచిస్తుంటారు. కానీ కైవల్య వోహ్రా మాత్రం తన ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. “కాలేజీ వదిలేశాను.. కానీ నా కలను వదల్లేదు” అనే ధైర్యంతో ఆయన తన కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. కైవల్య వోహ్రా.. తన చిన్ననాటి స్నేహితుడు అదిత్ పాలిచా ఇద్దరూ అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరారు. అయితే ఒక గొప్ప ఆలోచనను ఆలస్యం చేయకూడదనే నమ్మకంతో చదువును మధ్యలోనే ఆపి స్టార్టప్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
కోవిడ్ కష్టాల్లో పుట్టిన ఆలోచన..
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం ఇళ్లకే పరిమితమైనప్పుడు.. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం పెద్ద సవాల్‌గా మారింది. అదే సమయంలో కైవల్య, అదిత్ తమ కలను నిజం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని చూశారు. వీళ్లిద్దరూ మొదట వాట్సాప్ ద్వారా కిరాణా సరుకుల డెలివరీ సేవలను ప్రారంభించారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, ఆ చిన్న ఆలోచనను పెద్ద వ్యాపారంగా మార్చే దిశగా అడుగులు వేశారు. అదే ప్రయాణం తర్వాత “జెప్టో”గా మారింది. 2021లో ప్రారంభమైన జెప్టో భారత క్విక్ కామర్స్ రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. కేవలం 10 నిమిషాల్లోనే కిరాణా సరుకులను డెలివరీ చేస్తామని ప్రకటించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ కైవల్య వోహ్రా నేతృత్వంలోని జెప్టో బృందం అసాధ్యమనుకున్నదాన్ని సాధ్యం చేసింది. నగరాల్లో డార్క్ స్టోర్లను ఏర్పాటు చేసి, టెక్నాలజీ ఆధారంగా వేగవంతమైన డెలివరీ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ రోజు జెప్టో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, అమెజాన్ ఫ్రెష్ వంటి దిగ్గజ సంస్థలతో పోటీ పడుతోంది.
కేవలం కిరాణా యాప్ కాదు.. టెక్నాలజీ పవర్‌హౌస్
చాలామందికి జెప్టో అంటే కేవలం కిరాణా డెలివరీ యాప్‌గా కనిపిస్తుంది. కానీ దాని వెనుక ఉన్న అసలు బలం టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తూ వినియోగదారుల అవసరాలను ముందుగానే అంచనా వేసే వ్యవస్థలను జెప్టో అభివృద్ధి చేసింది. కైవల్య వోహ్రా కంపెనీ సహ వ్యవస్థాపకుడిగానే కాకుండా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా కూడా ఈ సక్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టార్టప్ వ్యవస్థాపకుల సంపద కేవలం వారి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుతో లెక్కించరు. కంపెనీ విలువ పెరిగినప్పుడు, అందులో వ్యవస్థాపకుల వాటాల విలువ కూడా పెరుగుతుంది. పెట్టుబడిదారుల నమ్మకం, కంపెనీ వేగవంతమైన వృద్ధి కారణంగా జెప్టో విలువ భారీగా పెరిగింది. దీంతో కైవల్య వోహ్రా భారతదేశపు అత్యంత చిన్న వయస్కుడైన టెక్ బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు. ఆయన నికర ఆస్తి విలువ సుమారు రూ.4,480 కోట్లుగా అంచనా వేయబడింది.
మారుతున్న భారత వ్యాపార ప్రపంచం
కొన్ని సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో సంప్రదాయ వ్యాపార కుటుంబాల పేర్లే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. ఏఐ, ఫిన్‌టెక్, క్విక్ కామర్స్, సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో కొత్త తరం యువకులు ప్రపంచ స్థాయిలో తమ ముద్ర వేస్తున్నారు. డిజిటల్ ఇండియా, యూపీఐ, చౌకైన ఇంటర్నెట్, పెరుగుతున్న స్టార్టప్ పెట్టుబడులు యువ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. కైవల్య వోహ్రా కథ కేవలం ఒక బిలియనీర్ కథ కాదు.. ఒక ఆలోచనపై నమ్మకం ఉంచి, రిస్క్ తీసుకుని, పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని చెప్పే స్ఫూర్తిదాయక ప్రయాణం. వయసు విజయానికి అడ్డంకి కాదని.. సరైన ఆలోచన, కష్టపడే తత్వం ఉంటే ప్రపంచాన్ని మార్చే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుందని కైవల్య వోహ్రా తన ప్రయాణంతో మరోసారి నిరూపించారు.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?