Korean Kanakaraju Review : కొరియన్ కనకరాజు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Varun Tej, Rithika Nayak, Satya, Muralidhar goud and others
- DIRECTOR: Merlapaka Gandhi
- MUSIC: Thaman
- PRODUCER: Uv Creations, First Frame
వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన తాజా మూవీ ‘కొరియన్ కనకరాజు’. నిజానికి వరుణ్ తేజ్ సహా మేర్లపాక గాంధీ, ఈ సినిమా నిర్మించిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్తో పాటు యూవీ క్రియేషన్స్‌కి హిట్ చాలా అవసరం. ఈ క్రమంలోనే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి ఉంది. అయితే ఈ సినిమా కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు ఏర్పడిన అంచనాల కంటే, ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసిన ట్రైలర్‌తో పాటు వరుసగా హీరో, దర్శకుడు చేస్తున్న ప్రమోషన్స్‌తో సినిమా మీద ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాను స్పెషల్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కొరియన్ కనకరాజు కథ
కనకరాజు (వరుణ్ తేజ్) అనంతపురం జిల్లా పెనుగొండలో ఒక చెక్కభజన బృందాన్ని నడిపిస్తూ ఉంటాడు. తన స్నేహితుడు కిష్టప్ప(సత్య)తో కలిసి సరదాగా లైఫ్ గడిపేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా అదే ఊరికి చెందిన చైత్ర (రితిక నాయక్)ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఎప్పటికైనా కొరియా వెళ్లి సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉండే ఆమె, అందుకోసం కియా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఊహించని విధంగా కనకరాజులోకి ఒక కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ కొరియన్ ఆత్మ ప్రవేశించాక కనకరాజు లైఫ్ ఏమైంది? అతను ఎందుకు కొరియా వెళ్లాల్సి వచ్చింది? చివరికి ఆ ఆత్మ కనకరాజుని వదిలేసిందా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే!
Also Read
విశ్లేషణ
ఈ సినిమాని ముందు నుంచి ఇండో-కొరియన్ హారర్ కామెడీ సినిమాగా ప్రమోట్ చేస్తూ వచ్చింది టీమ్. అయితే సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి వరకు కథ అంతా ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కనకరాజు శరీరంలోకి కొరియన్ వ్యక్తి ఆత్మ ప్రవేశించే వరకు సినిమా బోర్ ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ ఒక్కసారి ఆత్మ ఎంటర్ అయ్యాక సినిమా వేగం పుంజుకుంది. కొరియన్ ఆత్మ కనకరాజు శరంలోకి ఎంటర్ అయ్యాక, అతని స్నేహితుడైన కిష్టప్ప (సత్య) పాత్రతో కామెడీ బాగా వర్కౌట్ అయింది. మామూలుగానే సత్య వన్-లైనర్లకి, అతని ఎక్స్‌ప్రెషన్స్‌కి ప్రేక్షకులకు నవ్వు వస్తుంది. దానికి తోడు వరుణ్ తేజ్ టైమింగ్ కూడా తోడవడంతో ఫస్ట్ హాఫ్ బాగా వర్కౌట్ అయింది.
ఇక కథ సెకండ్ హాఫ్‌లోకి వెళ్లాక కొంచెం రొటీన్ ఫార్మాట్లోకి వెళుతుందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. లాజిక్స్ ఎక్కడా పెద్దగా పట్టించుకోకుండా సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నట్లు అనిపించింది. అయితే సెకండ్ హాఫ్‌లో కూడా సత్య, వరుణ్ తేజ్ మధ్య వచ్చే కామెడీ ఎపిసోడ్లు సినిమా మొత్తానికే కీలకమైన ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే ముందు నుంచి హారర్ కామెడీ అంటూ ప్రమోట్ చేస్తూ వచ్చిన ఈ సినిమాలో హారర్ పెద్దగా భయపెట్టకపోయినా, కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది.
ఫస్ట్ హాఫ్ మొత్తం మీద కొన్ని ఎపిసోడ్లు బాగా కుదిరాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచింది. సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యాక కథ కొరియాకి షిఫ్ట్ అవుతుంది. అక్కడికి వెళ్లాక కథ ఊహించిన విధంగానే సాగినా కూడా కొంతవరకు ఎంగేజింగ్గానే సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తుంది. అయినా సరే ఎక్కడా బోర్ ఫీలింగ్ కలగకుండా చూసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే కొంచెం లాజికల్‌గా కూడా కథనం పరంగా రాసుకుని ఉంటే ఇంకా రిజల్ట్ బాగుండేది.
నటీనటుల విషయానికి వస్తే, ఆత్మ ప్రవేశించిన పల్లెటూరి కుర్రాడిగా కనకరాజు అనే పాత్రలో వరుణ్ తేజ్ జీవించాడు. అతని లుక్స్, మేకోవర్ బాగా కుదిరాయి. అటు యాక్షన్‌తో పాటు కామెడీ, డాన్సులు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్‌తో పాటు అంతే పేరు సత్యకి కూడా వస్తుంది. ఎందుకంటే సత్య కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. వన్-లైనర్లు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మీమ్ మెటీరియల్‌ను అవపోసన పట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. రితిక నాయక్ ఉన్నంతలో పర్వాలేదనిపించేలా నటించింది. ఇక మురళీధర్ గౌడ్ కూడా తన రొటీన్ పాత్రలతో కాకుండా సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. బుల్లి రాజు, విటీవీ గణేష్ ట్రాక్ కూడా నవ్వించింది. వారిద్దరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక మిగతా కొరియన్ నటీనటులు ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్‌లకే పరిమితమయ్యారు, అవి కూడా సరిగ్గా సెట్ అయ్యాయి. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ (బిజీఎం) కూడా అంతే కరెక్ట్‌గా సెట్ అయింది. తమన్ పూర్తిస్థాయిలో తన డ్యూటీ చేసినట్లు అనిపించింది. ఇక మేర్లపాక గాంధీ రచయితగా, దర్శకుడిగా మరోసారి తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. అయితే లాజిక్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా బాగా కుదిరింది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఓవరాల్‌గా ‘కొరియన్ కనకరాజు’ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ విత్ సమ్ హారర్ ఎలిమెంట్స్.
తాజావార్తలు
-
Konda Surekha : గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి.? కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
-
PM Modi: కిర్గిజ్‌స్థాన్‌లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్‌లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
-
Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్‌కు సురేఖ ఫిర్యాదు.!
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!