Itlu Arjuna Review : ఇట్లు అర్జున రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: అనీష్, అనస్వర రాజన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, రఘుబాబు, ముకేష్ రిషి, కలైయరసన్, ఎలాంగో కుమారవేల్
- DIRECTOR: మహేష్ ఉప్పల
- MUSIC: తమన్
- PRODUCER: వెంకీ కుడుముల
వెంకీ కుడుముల దర్శకుడిగా అందరికీ పరిచయమే. కానీ నిర్మాతగా మారి, ఒక కొత్త కుర్రాడ్ని ఇట్లు అర్జున అనే సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాడనగానే అందరి దృష్టి ఆ కుర్రాడి మీద పడింది. దానికి తోడు, అనస్వర రాజన్ హీరోయిన్గా నటించడం, నాగార్జున సినిమా ప్రెజెంట్ చేయడంతో సినిమా స్కేల్ ఒక్కసారిగా మారిపోయింది. ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేయడం, మ్యూజికల్ కాన్సర్ట్‌కు రామ్ చరణ్ రావడం—ఇలా ఒక్కో ప్రమోషనల్ ఈవెంట్‌తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతూ వెళ్లాయి. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో అనస్వర రాజన్, అనీష్ సరసన హీరోయిన్గా నటించింది. మానస శర్మ కథా సహకారం అందించిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఇట్లు అర్జున కథ.
అర్జున్ (అనీష్)చిన్నప్పటి నుంచే మూగవాడు. తన తండ్రి అనారోగ్యంతో మరణించడంతో, ఒంటరిగానే తన ఫ్లాట్‌లో జీవిస్తూ ఉంటాడు. అతనికి తన పై ఫ్లాట్‌లో ఉండే కీర్తి (అనస్వరరాజన్) అంటే పిచ్చి ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆమెను మూగగానే ప్రేమిస్తూ ఉంటాడు. ఆమెకు ఎదురుపడడు. ఆమె కంట పడడు. కానీ ఆమెను మాత్రం ఆరాధిస్తూనే ఉంటాడు. ఇలా సాగిపోతున్న క్రమంలో, ఒకరోజు అనుకోకుండా వీరిద్దరూ కలుస్తారు. కీర్తికి అర్జున్ సాయం చేస్తాడు. ఒకరిమీద ఒకరికి ఫీలింగ్స్ పెరుగుతాయి. కానీ, ఏ ఒక్కరూ మరొకరికి తమ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయరు.మరో పక్క, పాత బస్తీ ప్రాంతంలో ఉండే డాన్ పెద్దన్న (ముఖేష్ రుషి) కొడుకు జైసల్మీర్ వెళ్లి వెయ్యి కోట్ల హవాలా డీల్ చేస్తూ మరణిస్తాడు. అయితే, తన కొడుకును చంపింది ఎవరో ట్రేస్ చేయించే క్రమంలో పెద్దన్న అనుచరుడు గౌరీ, పోలీస్ ఆఫీసర్ ఇరానీ ఇద్దరూ అర్జున్ వెంట పడతారు. అసలు పెద్దన్న కొడుకు చావుకి అర్జున్ కి సంబంధం ఏమిటి? అనుకోకుండా ఈ కేసులో అర్జున్ ఇరుక్కున్నాడా, లేక అసలు ఏం జరిగింది? చివరికి అర్జున్, కీర్తి ఒకటయ్యారా? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ: ‘ఇట్లు అర్జున’ టెక్నికల్‌గా చాలా బాగా తీసిన సినిమా. ఫస్టాఫ్ స్టార్టింగ్‌లోనే అసలు కథ ఏంటనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ఫన్, లవ్ సీన్స్‌తో సినిమా చాలా సరదాగా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే బాగా సెట్ అయింది. సెకండాఫ్‌లో ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీని పెంచుతూ ఫస్టాఫ్ ముగుస్తుంది.
సెకండాఫ్ కూడా మంచి కామెడీతోనే మొదలవుతుంది. కానీ చివరి 30 నిమిషాలు మాత్రం ఫుల్ యాక్షన్, మంచి ఎమోషన్‌తో సినిమాకే హైలైట్ అనేలా ప్లాన్ చేసుకున్నారు. కథలో మంచి పాయింట్ ఉంది. దానికి తోడు కరెక్ట్ కాస్టింగ్, టెక్నీషియన్స్ పనితనం సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి హీరో మూగవాడు అనే పాయింట్ ఈ కథకు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. మిగతా కథంతా మనకు తెలిసిన కమర్షియల్ ఫార్మాట్లోనే ఉన్నా, వెయ్యి కోట్ల హవాలా డబ్బు, పెన్ డ్రైవ్, పాస్వర్డ్ కోసం జరిగే వేటతో డైరెక్టర్ మంచి సస్పెన్స్, క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు. మొదటి భాగం అంతా మెయిన్‌గా హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ చుట్టూనే సరదాగా తిరుగుతుంది. వీరిద్దరి సీన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మధ్యమధ్యలో పెద్దన్న గ్యాంగ్ పెన్ డ్రైవ్ కోసం చేసే వెతుకులాట, వెన్నెల కిషోర్ కామెడీతో ఫస్టాఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. ఇంటర్వెల్ దగ్గర హీరో, హీరోయిన్లు ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకోవడంతో సెకండాఫ్ మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. రెండో భాగంలో లవ్ ట్రాక్ కాస్త ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అయినప్పటికీ వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, రఘుబాబు తమ కామెడీతో థియేటర్లో నవ్వులు పూయిస్తారు. ఇక చివరి 30-40 నిమిషాలు సినిమాకే హైలైట్. పెద్దన్న కోటలోకి హీరో ఎంట్రీ ఇవ్వడం, అక్కడ జరిగే యాక్షన్ సీక్వెన్స్, దానికి తమన్ ఇచ్చిన BGM సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. హీరోయిన్‌తో హీరో కలవడం అనే రెగ్యులర్ ఎండింగ్ ఇచ్చినా, ఆ వెయ్యి కోట్ల మ్యాటర్‌ని మాత్రం సస్పెన్స్‌గా వదిలేయడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బహుశా సీక్వెల్ హింట్ కావచ్చు.
నటీనటుల విషయానికి వస్తే అనీష్ తన బెస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ మూవీ అయినా ఎక్కడా కొత్తవాడిలా అనిపించలేదు. ముఖ్యంగా మాటలు రాని (Mute) క్యారెక్టర్ని చాలా కాన్ఫిడెంట్‌గా చేశాడు. తనకి ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉంది. అనశ్వర రాజన్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసింది. తెలుగు ఆడియన్స్ ఆమెలో ఇంత ఫన్ యాంగిల్ చూడటం ఇదే ఫస్ట్ టైమ్. హీరో, హీరోయిన్ ఇద్దరూ చూడటానికి చాలా బాగున్నారు, వాళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా సూపర్‌గా వర్కవుట్ అయింది. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు తమ కామెడీతో బాగా నవ్వించారు.
టెక్నికల్ టీమ్ పనితీరు విషయానికి వస్తే థమన్ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. తన మ్యూజిక్‌తో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. 4 పాటలు సూపర్‌గా ఉన్నాయి, ఇక BGM అయితే థియేటర్లలో అదరగొట్టేశాడు కెమెరా పనితనం (విజువల్స్) టాప్ నాచ్‌లో ఉంది. కొత్త డైరెక్టర్ మహేష్ ఉప్పల ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేశాడు. వెంకీ కుడుముల ఈ టీమ్‌పై పెట్టుకున్న నమ్మకం నిజమైంది. కింగ్ నాగార్జున బ్రాండ్ ఈ యంగ్ టీమ్‌కు పెద్ద ప్లస్ అయింది.
‘ఇట్లు అర్జున’ మంచి ప్రయోగం..టెక్నికల్లీ సౌండ్..
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!