Windfall Tax Hike: కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.14కు పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Windfall Tax Hike: అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ను మరోసారి పెంచింది. అయితే పెట్రోల్ ఎగుమతులపై ఈ పన్నును సున్నా స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ కొత్త పన్ను రేట్లు 2026 నవంబర్ 16 నుంచి 15 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED), రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ కలిపి మొత్తం పన్నును లీటరుకు రూ.11.50 నుంచి రూ.14కు పెంచారు. అదేవిధంగా విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటరుకు రూ.11 నుంచి రూ.12.50కు పెంచారు. పెట్రోల్ ఎగుమతులపై మాత్రం ఎలాంటి పన్ను విధించడం లేదు. మరోవైపు దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్‌పై ఇప్పటికే అమల్లో ఉన్న పన్నుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
Also Read
- Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!
- Edible Oil Imports Surge: వంట నూనెల దిగుమతుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు.. 24 శాతం పెరిగిన బిల్లు!
- Success Story: ఐఐటీ కుర్రాడి క్రేజీ బిజినెస్ ఐడియా.. కుల్దీప్ సక్సెస్ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే!
- Egg: గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్?
అక్టోబర్ నెలలో కూడా కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్ రేట్లలో మార్పులు చేసింది. అక్టోబర్ 31 నుంచి 15 రోజుల పాటు అమల్లో ఉండేలా విమాన ఇంధన ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.10.50 నుంచి రూ.11కు పెంచింది. అదే సమయంలో డీజిల్ ఎగుమతులపై మొత్తం పన్నును రూ.8.50 నుంచి రూ.11.50కు పెంచింది. అంతకుముందు అక్టోబర్ 16 నుంచి పెట్రోల్ ఎగుమతులపై విధించే పన్నును లీటరుకు రూ.0.50 నుంచి రూ.2.50కు పెంచింది. అయితే డీజిల్ ఎగుమతులపై పన్నును రూ.16 నుంచి రూ.8.50కు తగ్గించింది. అక్టోబర్ 1 నుంచి డీజిల్ ఎగుమతులపై పన్నును రూ.20 నుంచి రూ.16కు తగ్గించగా, విమాన ఇంధన ఎగుమతులపై పన్నును రూ.15 నుంచి రూ.10.50కు తగ్గించింది. ఈ విధంగా అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా కేంద్రం ప్రతి 15 రోజులకు ఒకసారి పన్ను రేట్లను సమీక్షిస్తోంది.
సాధారణంగా ఊహించని పరిస్థితుల వల్ల కంపెనీలకు భారీగా అదనపు లాభాలు వచ్చినప్పుడు వాటిపై విధించే ప్రత్యేక పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటారు. ఉదాహరణకు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పుడు పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు దేశీయ అవసరాలను పక్కనపెట్టి అధిక ధరలు లభించే విదేశీ మార్కెట్లకు ఎక్కువగా ఎగుమతులు చేయకుండా నియంత్రించడం ఈ పన్ను ప్రధాన ఉద్దేశం.
దేశీయంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం తగినంత అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు ఎగుమతిదారులు అసాధారణ పరిస్థితుల వల్ల అధిక లాభాలు పొందకుండా నియంత్రించేందుకు ఈ పన్ను ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం గత రెండు వారాల సగటు చమురు ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రతి 15 రోజులకు ఒకసారి విండ్‌ఫాల్ ట్యాక్స్ రేట్లను సమీక్షిస్తుంది. అవసరాన్ని బట్టి పన్నులను పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది.
తాజావార్తలు
-
Windfall Tax Hike: కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.14కు పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ!
-
IPL 2027-MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. ఏడాది ఉత్కంఠకు తెర!
-
Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo భారత్‌లోకి వచ్చేస్తోంది.. 50MP Sony కెమెరా, 7,000mAh బ్యాటరీతో!
-
Varanasi Update: ఇదొక అప్డేటే.. అసలైన బ్లాస్ట్ కోసం వేచి చూడాల్సిందే!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!