Pattabhi: ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. ఈ వీడియోపై ఇటీవల టీడీపీ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స్వయంగా ప్రకటించడం మరింత చర్చకు దారి తీసింది. దీంతో టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియోలో ఎడిటింగ్ లేదని జిమ్ స్టాఫోర్డ్ ఇచ్చిన నివేదిక వాస్తవమని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి స్పష్టం చేశారు. ఈ అంశంలో త్వరలోనే మరిన్ని…
ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన వివాదాస్పదంగా మారింది. సీబీఐ కోర్టుకు జగన్ ముందుగా చెప్పినట్లు నేరుగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ వెళ్లకుండా లండన్‌లో ల్యాండ్ కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ అంశాన్ని టీడీపీ వదిలిపెట్టడం లేదు. దండుకున్న అవినీతి సంపదను దాచుకోవడానికే జగన్ లండన్ వెళ్లారని శనివారం టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ నేత పట్టాభి కూడా జగన్ లండన్ టూర్‌పై విమర్శల వర్షం…
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. జగనన్న గోరుముద్ద పథకంలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని పట్టాభి ఆరోపించారు. ఈ పథకంలో 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని.. ఇవేమీ జగన్ తన జేబులో నుంచి తీసి ఇస్తున్న డబ్బులు కావన్నారు. అలాంటి కేంద్ర ప్రభుత్వ నిధులను ఏపీ సర్కారు పక్కదారి పట్టిస్తోందన్నారు. చిక్కీలు సరఫరా చేసే కేంద్ర కంపెనీని దిక్కుమాలిన కారణాలు చెప్పి డిస్ క్వాలిఫై చేశారని పట్టాభి విమర్శించారు.…
ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు తర్వాతే హైదరాబాద్ భౌగోళిక స్వరూపం మారిపోయింది. నగర విస్తరణ, అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరం అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. అమరావతి రాజధాని, దాని చుట్టూ వున్న విజయవాడ,గుంటూరును కలుపుతూ 189కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు రూపకల్పన జరిగింది. 17761కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం ఆమోదించింది. అటువంటి ప్రాజెక్ట్ ను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓఆర్ఆర్ ను మంగళం పడేశారని కేంద్ర మంత్రి నీతిని…
టీడీపీ నేత పట్టాభి సడెన్‌గా మాల్‌దీవ్స్‌కు ఎందుకెళ్లారు? ఆయనే వెళ్లారా.. ఇంకెవరైనా పంపించారా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? రిలాక్సేషన్ కోసం మాల్‌దీవ్స్ వెళ్లిన పట్టాభి కదలికపై నిఘావర్గాలు కన్నేశాయా? చంద్రబాబే ఖర్చులకు ఇచ్చి మాల్‌దీవ్స్‌కు పంపారా? పబ్లిక ప్రెస్‌మీట్‌లో బోసడీకే పదాన్ని వాడి.. నాలుగు రోజులు AP రాజకీయాన్ని అగ్గగ్గలాడించిన టీడీపీ నేత పట్టాభి.. సడెన్‌గా మాల్‌దీవ్స్‌కి జంప్ అయిపోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్ వచ్చిన పట్టాభి తానే రిలాక్సేషన్ కోసం వెళ్లిపోయారా? లేక…
సీఎం జగన్‌ను అసభ్యపదజాలంతో దూషించిన కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్‌కు విజయవాడ 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం మధ్యాహ్నం పట్టాభిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి నవంబర్ 2 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టాభి తన వాదనలను న్యాయమూర్తికి వినిపించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని… ప్రభుత్వంలో ఉన్న లోపాలనే ప్రస్తావించానని తెలిపారు. తన ఇంటిపై వైసీపీ కార్యకర్తలు అనేకసార్లు దాడి చేశారని…
ఏపీ సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను విజయవాడ గవర్నర్ పేట పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గురువారం మధ్యాహ్నం విజయవాడలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తాను మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తికి పట్టాభి వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభిపై పోలీసులు సెక్షన్ 153 (ఎ), 505 (2) , 353, 504 రెడ్ విత్…
అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల నిరసనలతో ఏపీ హీటెక్కింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పట్టాభి, నారా లోకేష్, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి ఇంచార్జ్ అనం రెడ్డి అజయ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అన్నిటికీ చంద్రబాబునాయుడే కారణమని, రాష్ట్రంలో మేమున్నామని,రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి దాడుల డ్రామా ఆడుతున్నారని అజయ్ అన్నారు. బుధవారం సాయంత్రం పెందుర్తి కూడలి లో వైసీపీ శ్రేణులు…