Heavy Rains In Tirupati: టెంపుల్ సిటీ తిరుపతిలో గత ఐదు గంటలుగా భారీగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వానకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక, తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తిరుపతి ముంపునకు కారణం ఎవరు? వర్షం తగ్గి వారం అవుతున్నా నగరంలో నీరు ఎందుకు లాగడం లేదు? ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే ఎందుకు నానుతున్నాయి? ఇది ప్రకృతి వైపరిత్యామా లేక ఆ నేత వాస్తు భయమా? తిరుపతి ప్రజలు గతంలో ఎన్నాడూ చూడని వరద ఇక్కట్లు..! ప్రపంచ పటంలో తిరుపతికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభూవై వెలసిన పుణ్యక్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుపతి వస్తుంటారు.…