తెలంగాణ కాంగ్రెస్‌లో ఫిర్యాదులు కామన్ అయిపోయాయా? రోజుకో కంప్లయింట్ పీసీసీకి తలనొప్పిగా మారిందా? హైకమాండ్‌కు వివరణ ఇవ్వటానికే టైమ్ సరిపోతోందా? వరస ఫిర్యాదులపై అధిష్ఠానం ఏం చేయబోతుంది? ప్రతి సమస్యపై ఏఐసీసీకి లేఖలు రాసేస్తున్నారా?తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రధాన శత్రువులు ఎక్కడో ఉండరు. సొంత పార్టీలోని నాయకులే.. పార్టీ నేతను కట్టడి చేస్తారు. అనుకున్నది అనుకున్నట్టు అయితే.. ఓకే..! లేదంటే హైకమాండ్‌కు ఫిర్యాదులు కామన్. ఇది కాంగ్రెస్‌లో సర్వసాధారణం. అందుకే కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు.…