పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు షామిర్ పేటలో కలిశారన్నారు. ఒక ఫామ్ హౌస్ లో సీక్రెట్ గా కలిశారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పారు కాబట్టే హరీష్, ఈటల కలిశారన్నారు. కాళేశ్వరం కమిషన్ విషయంలో అంత ఒకటే సమాధానం చెప్పాలని మాట్లాడుకున్నారన్నారు.
Congress : కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గాంధీ భవన్ లోని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతలకు గౌరవం లేకుండా, పదవులు, ప్రభుత్వం, కార్పొరేషన్ లలో ఉన్నతస్థానాలు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బంధువులకే…
హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఆర్ఎంపీ (RMP), పీఎంపీ (PMP) గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. రాజశేఖర్ రెడ్డి హయంలో 14 వేల మందికి శిక్షణ ఇచ్చారు.. ఇంకా తమకు సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ.. ఇప్పుడు తమపై దాడులు జరుగుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులుగా ఉన్న తమకు ప్రభుత్వ గుర్తింపు కావాలంటూ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారు.
Ponnam Prabhakar : ఈనెల 16 న గాంధీ భవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రవాణా , బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 16 వ తేదీ సోమవారం రోజున గాంధీ భవన్ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి…
మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పరకాలలో కార్యకర్తల అత్యుత్సాహం వల్లే ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందన్నారు.
లోకల్ బాడి ఎన్నికలను సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్టీవీతో ప్రత్యేకగా చెప్పారు. పీసీసీలో 60 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే వస్తాయని అన్నారు. పీసీసీ బీసీకి ఇస్తే.. పూర్తి వాటా దక్కింది అనుకోమని చెప్పారు. మరోవైపు.. కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Congress: తెలంగాణ పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ ఇంకా కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో భేటీ అయినప్పటికీ స్పష్టత రాలేదు. మరోసారి సోమవారం సమావేశం ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించారు.