Off The Record: ఆ అధికారులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారా? దొరికిందే ఛాన్స్ దండుకుందామంటూ వీర దోపిడీకి తెర లేపారా? పొలిటికల్ మానిటరింగ్ లేక ఆఫీసర్స్ ఇష్టారాజ్యం అయిపోయిందా? బంధువులు, స్నేహితుల పేరుతో పనులు చేయించి, బిల్లులు చేసుకుంటున్నది ఎక్కడ? అసలు ఎందుకా పరిస్థితి వచ్చింది?
Read Also: PM Modi: SIR చొరబాటుదారుల్ని ఏరేస్తుంటే, దేశద్రోహులు వారిని రక్షిస్తున్నారు..
తెలంగాణలో మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం జనవరితో ముగిసింది. చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాలన ముగిసి 11 నెలలవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 124 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్స్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. దీంతో అన్ని విషయాల్లో వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ ఆఫీసర్ ఎంత చెబితే అంతే. ఏం చెబితే అదే. ఎవ్వరైనా మరో మాట మాట్లాడడానికి వీలు లేదు. దాన్ని అడ్డం పెట్టుకుని కాంట్రాక్ట్ పనులు, ప్రభుత్వ నిధుల్ని నచ్చిన వారికి మంజూరు చేస్తూ కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మున్సిపల్ ఆదాయ వనరుల్ని పక్కన పెట్టి, ప్రభుత్వ నిబంధనల్లో ఉన్న లొసుగుల్ని అనుకూలంగా మార్చుకుంటూ అందిన కాడికి దోచుకుంటున్నారట. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, పారిశుధ్యం, రెవెన్యూ విభాగాల్లో అడ్డగోలుతనం పెరిగిపోయిందని చెప్పుకుంటున్నారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా భారీగా డబ్బులు వసూలు చేసి అక్రమాలు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
Read Also: Bhartha Mahashayulaku Vignapthi: పైసా తీసుకొని రవితేజ.. కానీ ఒక కండిషన్!
మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరిగినా చర్యలు తీసుకోవడం లేదు. అనుమతుల్లో మాత్రమే సెట్బ్యాక్స్ చూపిస్తూ క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటివేం ఉండటం లేదట. దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నతాధికారుల సాయంతో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అందిన కాడికి దోచుకుంటున్నారన్న అభియోగాలున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేస్తున్న వారి నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, పాలక మండళ్ళు లేకపోవడంతో ప్రశ్నించే వాళ్ళే లేకుండా పోయారంటూ వాపోతున్నారు రాజకీయ నాయకులు. కొందరు మున్సిపల్ ప్రత్యేక అధికారులైతే.. తమ బంధువులకు, స్నేహితులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించి బిల్లులు డ్రా చేస్తున్నారట. సాధారణంగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో బిల్లులు అంత త్వరగా మంజూరుకావని అంటారు. ప్రతీ స్థాయిలో ఎంతో కొంత ముట్టచెప్పనిదే ఫైల్ ముందుకు కదలదు. కానీ… ప్రత్యేక అధికారుల పాలనలో మున్సిపల్ కమిషనర్లే అన్నీ చూసుకుంటూ.. కావాల్సిన వాళ్ళకు చకచకా బిల్స్ ఇచ్చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు మాజీ కౌన్సిలర్స్, కార్పొరేటర్స్.
Read Also: Bangladesh: బంగ్లా జాతీయ కవి పక్కనే రాడికల్ హాది అంత్యక్రియలు.. ఎందుకు ఇలా చేశారు?
ప్రభుత్వ కార్యక్రమాలు, డ్రైనేజీల రిపేర్లు, కొత్త సిసి రోడ్ల నిర్మాణం వంటి పనుల్ని తమ మనుషులకే ఇప్పించుకుని, డబ్బులు దండుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనం అయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అయితే ఇంకా ఘోరంగా ఉందట వ్యవహారం. ఆ 27 కార్యాలయాల్లో పాత బోర్డులు తొలగించి కొత్త బోర్డులు ఏర్పాటు చేయడానికి, వాల్ రైటింగ్స్ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశారు అధికారులు. ఈ బోర్డుల పేరు మీదనే లక్షల రూపాయలు నొక్కారని ఉద్యోగులు చెవులు కొరుక్కుకుంటున్నారు. దీనికి తోడు విలీనం అయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విలీన మున్సిపాలిటీల్లోని అన్ని రికార్డులు సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించినా ఇంకా రికార్డులు అప్పగించ లేదంటే అక్రమాలకు ఆస్కారం కల్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఎంత లేటైతే ఈ అక్రమార్కులకు అంత అవకాశం కల్పించినట్టు అవుతుందని, వీలైనంత త్వరగా మున్సిపల్ పాలక మండళ్ళు ఏర్పాటయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు రాజకీయ నాయకులు.