OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
- కొండా ఫ్యామిలీ దారెటు అనేదానిపై జోరుగా చర్చలు
- కొండా సురేఖ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం
- ఇంతా జరిగాక కొండా కుటుంబం కాంగ్రెస్‌లో కొనసాగగలదా..?
- కొండా కుటుంబం ఏ పార్టీని ఎంచుకుంటుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: ఆ మాజీ మంత్రి బీజేపీ వైపు చూస్తున్నారా..? ఆమె కుటుంబంలో బీజేపీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారా..? ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా ఎక్కువకాలం ఇమడలేకపోయిన ఆమె… కాషాయదళంలో అయినా కుదురుగా ఉండగలరా..? ఆమె ఆటిట్యూడ్ కమలం పార్టీకి సూట్ అవుతుందా..? లేదంటే సంప్రదింపుల వార్తలన్నీ హంబక్కేనా..? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి..? ఏమిటామె లెక్క..? లెట్స్ వాచ్. తాజా మాజీ మంత్రి కొండా సురేఖ ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్స్ ఏంటి..? అత్యంత అవమానకరంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురయ్యారామె. ఇప్పుడు కొండా ఫ్యామిలీ దారెటు అనే చర్చ జోరుగా జరుగుతోంది. రకరకాల ఈక్వేషన్లు, ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. గతవారం పది రోజుల నుంచి కొండా సురేఖను మంత్రివర్గంలోంచి తొలగించడం ఖాయమనే చర్చ జరిగింది. చివరికి అది నిజమైంది. సురేఖ మంత్రి పదవి కోల్పోవడం ఖాయమనే ప్రచారం మొదలైనప్పుడే ఆమె బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం కూడా షురూ అయింది.
కొండా సురేఖ కుటుంబం మాత్రం తాము కాంగ్రెస్‌లోనే ఉంటామని చెబుతోంది. అయితే ఇంతా జరిగాక కొండా కుటుంబం కాంగ్రెస్‌లో కొనసాగగలదా..? అది అంత ఈజీనా..? సురేఖ పట్ల కాంగ్రెస్ హైకమాండ్ చాలా సీరియస్‌గా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఆమెకు మునుపటి స్థాయిలో గౌరవం లభిస్తుందా..? అసలామెను కాంగ్రెస్ పరిగణలోకి తీసుకుంటుందా..? ఇన్ని అనుమానాల మధ్య సురేఖ, ఆమె కుటుంబం కాంగ్రెస్‌లో ఎలా కంటిన్యూ కాగలరు. కొండా కుటుంబం కాంగ్రెస్‌ను వదలక తప్పని పరిస్థితిని తీసుకొచ్చే అవకాశముందని సమాచారం. పార్టీ ఆ పని చేయకపోయినా… ఆ కుటుంబ నైజాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ కొనసాగకపోవచ్చనే మాట వినిపిస్తోంది. అలా అయితే… కొండా కుటుంబం ఏ పార్టీని ఎంచుకుంటుంది. ఆమె గతంలో బీఆర్ఎస్లో కూడా పనిచేశారు. ఆ పార్టీని బయటకు వచ్చేశాక… 2023లో మంత్రి అయ్యాక కూడా బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కుటుంబాన్ని కూడా ఇష్టమొచ్చినట్టు తిట్టారు. ఇలాంటి నేపథ్యంలో ఆమె బీఆర్ఎస్కు వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. ఇక ఆమె ముందున్న ఆప్షన్స్‌లో బీజేపీ ఒకటి. బీజేపీ టచ్‌లో ఉన్నారనే ప్రచారం చాలారోజులుగా జరుగుతోంది. సురేఖ రీసెంట్గా తెలంగాణ బీజేపీ స్టేట్ అధ్యక్షుడితో మాట్లాడటంతో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కమలం నేతలతో మంతనాలు జరుపుతున్నారని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీ తమతో టచ్‌లోకి రాలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. జరుగుతున్న ప్రచారం అంతా ఊహగానమేనంటున్నారు. ఏ బీజేపీ నేత కూడా కొండా సురేఖ బీజేపీలో చేరతానంటే తీసుకుంటామని ప్రత్యక్షంగా చెప్పడంలేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో సురేఖ బీజేపీలోకి రావడం అంతా సులభం కాదనే మాటలు ఆ పార్టీలోనే గట్టిగా వినిపిస్తున్నాయట. ఆమె బీజేపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అలాగే సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన నాయకత్వం ఉంది. వాళ్లను కాదని ఈమెను ఎలా చేర్చుకుంటారనే ప్రశ్న పార్టీ కేడర్ నుంచి వస్తుంది. అదే సమయంలో కొండా కుటుంబ నేపథ్యం, ఆటిట్యూడ్ కమలం పార్టీకి సూట్ కావనే చర్చ ఆ పార్టీలో జరుగుతోందట. అయితే ఉధృతంగా ప్రచారం జరుగుతున్న కారణంగా బీజేపీ నేతలు కూడా సురేఖ బీజేపీలో చేరతారా..? ఆ అవకాశం ఉందా..? అని ఆరాలు తీస్తున్నారట. కొండా సురేఖ జనసేనలో కూడా చేరొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే… రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న విషయం గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. కొండా వాట్ నెక్ట్స్ అనేదానిపై చర్చ బాగానే జరుగుతోంది.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?