OTR: తెలంగాణ రాజకీయాల్లో పెరుగుతున్న ఘర్షణలు..! రాజకీయ వైరమా?.. వ్యక్తిగత శత్రుత్వమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: ఒకప్పుడు రాజకీయాలకు వేదిక అసెంబ్లీ.. ఆ తర్వాత ప్రెస్మీట్లు, బహిరంగ సభలు.. చివరికి ఇప్పుడు హోటళ్లు కూడా రాజకీయ ఘర్షణలకు వేదికలవుతున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ హోటల్లో జరిగిన రచ్చ చూస్తే..తెలంగాణ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయన్న ప్రశ్న రావడం సహజం. మూడేళ్ళ క్రితం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగాల హామీని గుర్తుచేస్తూ వినూత్న నిరసనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. ఆ నిరసన తీరుపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. హోటల్లోని ఫర్నిచర్ ధ్వంసమైంది. పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఘటనపై ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. రాజకీయ నాయకుల మధ్య పంచాయితీకి హోటల్ యజమాని ఏం చేశాడు? అక్కడ భోజనం చేయడానికి వచ్చిన సామాన్యులు ఏం పాపం చేశారు? ఉద్యోగాల అంశంపై మొదలైన నిరసన ఇలాంటి చిల్లర గొడవలతో అసలు సమస్యను పక్కదారి పట్టించలేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమువుతున్నాయి.
ఇదేదో ఒక్కరోజుతో ముగిసిన వ్యవహారం కాదు. అంతకు ముందు వారం రోజుల క్రితం ఎల్బీనగర్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వేదికపై ఎవరుండాలన్న వివాదం చివరకు తోపులాటకు దారితీసింది. ప్రజలకు పింఛన్లు అందించాల్సిన వేదికపై రాజకీయ ఆధిపత్య పోరాటమేంటి? మంచి చేయడంలో పోటీపడాల్సిన నాయకులు వేదికలపై స్థానం కోసం గొడవపడ్డం ఏంటి? రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండటం సహజం. కానీ.. వాళ్ళను శత్రువులుగా చూడటం మొదలైతేనే అసలు సమస్య. రాజకీయ వైరం కాస్తా.. కార్యకర్తల మధ్య వ్యక్తిగత గొడవగా మారితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అన్ని పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇక తెలంగాణలో నిరసనల స్వరూపం కూడా మారుతోందన్న చర్చ మొదలైంది. ఇటీవల హైదరాబాద్‌లోని మెటా కార్యాలయ ప్రాంగణంలో యువజన కాంగ్రెస్ నేతల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. తమ నాయకుల సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు కార్యకర్తలు. ఆ సమయంలో ఆఫీస్ వస్తువులు ధ్వంసం చేశారు. సోషల్ మీడియా సంస్థ నిర్ణయాలపై అభ్యంతరం ఉండొచ్చు. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిందన్న ఆవేదన ఉండొచ్చు. కానీ.. దానిపై న్యాయ పరంగా పోరాడొచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపొచ్చు. అదీఇదీ కాదని ఆస్తుల ధ్వంసంతో ఏం సాధిస్తారు? ఓ వైపు తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Also Read
- OTR: "ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్".. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో ఇన్ఛార్జ్ బిజీ
- Off The Record: కూటమిలో అసమ్మతి..! డిప్యూటీ మేయర్ వ్యవహారం చిచ్చు పెట్టిందా..?
- OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
- OTR: బలమున్న చోట కాదు.. బలం లేని చోట సత్తా చాటాలని ఆదేశం.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి?
అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానిస్తోంది. మరోవైపు కార్పొరేట్ సంస్థల ప్రాంగణాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే పెట్టుబడిదారులకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయన్న ప్రశ్న వస్తోంది? ప్రభుత్వాలు మారొచ్చు.. పార్టీలు వేరు కావొచ్చు. కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అందరిదీ కదా! వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించే సంస్థలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుంది కదా! పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గతంలో జరిగిన రాజకీయ ఘర్షణలను చూసి ఆందోళన వ్యక్తం చేసేవాళ్లం. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి రాజకీయ ఘర్షణలు చోటుచేసుకోవడం ఆలోచించాల్సిన అంశమని అంటున్నారు పరిశీలకులు. ఈ సంస్కృతి హైదరాబాద్‌కే పరిమితమవుతుందా? జిల్లాలకు కూడా విస్తరిస్తుందా? ఒకవేళ గ్రామస్థాయికి చేరితే పరిస్థితి ఏంటి? రాష్ట్రస్థాయిలో నాయకులు రాజకీయంగా కొట్లాడుకుని ఆ తర్వాత కలిసిపోవచ్చు. కానీ గ్రామాల్లో కార్యకర్తల మధ్య ఏర్పడే విభేదాలు ఏళ్ల తరబడి కొనసాగుతాయి. రాజకీయాలు కుటుంబాల మధ్య చిచ్చుపెడితే.. గ్రామాల్లో ప్రశాంతత దెబ్బతింటే.. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారన్నది మెయిన్ క్వశ్చన్.
తెలంగాణ ఉద్యమం ఎన్నో భావోద్వేగాలతో సాగింది. ధర్నాలు, దీక్షలు, నిరసనలు, ప్రజా ఉద్యమాలతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటింది. ప్రజాస్వామ్యబద్ద నిరసనల శక్తిని చాటిచెప్పిన తెలంగాణలో రాజకీయ హింసకు తావెందుకని అడుగుతున్నారు సీనియర్ విశ్లేషకులు. ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికుంటే.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షానికుంటుంది. నిరసనలకు ప్రతి నిరసన తెలపొచ్చుగానీ.. భౌతిక దాడులకు దిగడం ఏ పార్టీకి చెందిన వారైనా సమర్థనీయం కాదు. అసలు ఈ వ్యవహారాల్లో పార్టీ హైకమాండ్ పాత్రేంటి? కార్యకర్తలు హద్దులు దాటితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు రావాల్సి ఉంది. పార్టీ జెండా ఏదైనా చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. తప్పు చేసిన వారిపై ఆధారాల ప్రకారం చర్యలు తీసుకోవాలి. రాజకీయాల్లో గెలవాల్సింది వాదన.. ఓడించాల్సింది ప్రత్యర్థి వాదన.. అంతేగానీ ప్రత్యర్థిని భౌతికంగా దెబ్బతీయడం కాదన్నది జనరల్ ఒపీనియన్. తెలంగాణలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా రాజకీయ పార్టీల పెద్దలు ఇప్పుడే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు పరిశీలకులు. లేదంటే రాజకీయ వైరం సామాజిక వైరంగా మారే ప్రమాదం లేకపోలేదన్న వార్నింగ్స్ సైతం వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR: తెలంగాణ రాజకీయాల్లో పెరుగుతున్న ఘర్షణలు..! రాజకీయ వైరమా?.. వ్యక్తిగత శత్రుత్వమా?
-
OTR: “ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్”.. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో ఇన్ఛార్జ్ బిజీ
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Off The Record: కూటమిలో అసమ్మతి..! డిప్యూటీ మేయర్ వ్యవహారం చిచ్చు పెట్టిందా..?
-
Karthigai Deepam Row: కార్తీక దీపం వివాదం.. సికందర్ బాదుషా దర్గాకు పోటెత్తిన భక్తులు.. కేరళం నుంచి కూడా రాక!
ట్రెండింగ్
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!