Tollywood Movies: స్టార్ హీరోలతో డైరెక్టర్ల ప్రయోగం సక్సెస్.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సినిమాలకు కొదవ లేదు. ప్రతి ఏటా సినిమాల సంఖ్య పెరుగుతుందే కానీ ఎక్కడా తగ్గలేదు. ఫ్యాన్స్ అభిరుచులకు తగ్గట్లుగా కొత్త ప్రయోగాలు చేసేందుకు అటు డైరెక్టర్లు కూడా సిద్ధం అవుతున్నారు. రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్లు కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ మధ్య ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. డార్క్ షేడ్‌లో సినిమాలను తెరకెక్కిస్తూ కొంతమంది డైరెక్టర్లు సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ మధ్య డైరెక్టర్లు ఇదే ఫార్మాట్‌ను ఫాలో అవుతున్నారని తెలిసిందే. డార్క్ హీరోయిజం మూవీలకు ప్రస్తుతం డిమాండ్ కూడా ఉండటంతో, స్టార్ హీరోలు అందరూ కూడా ఇలాంటి కథలను చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఇప్పుడు డార్క్ షేడ్స్ కథలతో ఏ హీరోల సినిమాలు రాబోతున్నాయి?
రెబల్ స్టార్ ప్రభాస్ గతంలో నటించిన ‘సలార్’ మూవీ డార్క్ షేడ్‌లోనే వచ్చింది. ఈ మూవీ స్టోరీ ఫ్యాన్స్‌కు నచ్చడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అన్న సామెతకు తగ్గట్లుగా, ఇలాంటి డార్క్ స్టోరీలతో వరుసగా సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ మూవీ అలాంటి డార్క్ కాన్సెప్ట్‌తో వస్తోంది. మరి ఈ మూవీ ఏ మాత్రం మెప్పిస్తుందో అన్నది తెలియాలంటే సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘డ్రాగన్’ కూడా డార్క్ షేడ్‌లో వస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే దాదాపు డార్క్ కలర్ పాలెట్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తున్నాయి. కానీ డైరెక్టర్ ఈసారి రూటు మార్చాడు. ఈ మూవీలో బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటుగా కలర్ బ్యాక్‌గ్రౌండ్ కూడా వస్తుందని టాక్ వినిపిస్తోంది.
ఇక అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ మూవీ డార్క్ షేడ్‌లోనే ఉంటుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్‌ను చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా డార్క్ షేడ్‌లోనే ఉన్నాయి. మొన్నటివరకు ఇదే ట్రెండ్, కానీ ఇప్పుడు కాస్త ట్రెండ్ మారింది. అభిమానులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైనా డైరెక్టర్లు క్రియేటివ్‌గా ఆలోచించి కొత్త కథలకు పదును పెడతారేమో చూడాలి.
- Tags
- #dragon
- Allu Arjun
- Atlee
- Jr NTR
- prabhas
తాజావార్తలు
-
Tollywood Movies: స్టార్ హీరోలతో డైరెక్టర్ల ప్రయోగం సక్సెస్.. కానీ?
-
Jr NTR: త్రివిక్రమ్, అనిల్ రావిపూడి.. ఎన్టీఆర్ సినిమా ఎవరితో?
-
Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
-
Bronson Reed: రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ప్రముఖ WWE స్టార్ కన్నుమూత..
-
Preethi Mukundan: ప్రీతి ముకుందన్ లేడీ ఓరిఎంటెడ్ మూవీ?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!