Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాకీ ఇండియా ఎన్నికలకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ సుప్రీంకోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించేందుకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ఎన్నికలపై స్టే విధిస్తూ ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం పక్కనపెట్టింది. అంతేకాకుండా.. హాకీ ఒడిశాను శాశ్వత సభ్యుడిగా కొనసాగించాలని ఆదేశిస్తూ, నిబంధనల ఉల్లంఘన పేరుతో దానికి జారీ చేసిన రెండు షోకాజ్ నోటీసులను, అసోసియేట్ మెంబర్‌గా మార్చాలన్న ప్రతిపాదనను కోర్టు రద్దు చేసింది. ఈ తీర్పుతో ప్రస్తుత అధ్యక్షుడు దిలీప్ టిర్కీ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది.
ఎన్నికలు నిర్వహించకపోతే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) నుంచి గుర్తింపు రద్దయ్యే ప్రమాదం ఉందని, క్రీడా ప్రయోజనాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాలని ఆదేశించినట్లు కోర్టు స్పష్టం చేసింది. అనుబంధ విభాగాలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, గతంలో ఢిల్లీ హైకోర్టు సూచించిన విధంగా రిటైర్డ్ జస్టిస్ ఎ.కె. సిక్రీ నేతృత్వంలోని ఏకసభ్య ఫిర్యాదుల పరిష్కార కమిటీ విచారిస్తుందని ధర్మాసనం తెలిపింది.
Also Read
- Bronson Reed: రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ప్రముఖ WWE స్టార్ కన్నుమూత..
- Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో విషాదం.. పాఠశాల పక్కన భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థులు మృతి..
- Veera Siva Reddy: కడప రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబు, లోకేష్‌పై బీజేపీ నేత హాట్ కామెంట్స్!
- Kakinada Municipal Corporation Elections: కాకినాడ కౌంటింగ్‌పై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. వారికి నో ఎంట్రీ!
అయితే.. చేతిలో కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ ప్రక్రియ మొత్తాన్ని ఎలా పూర్తి చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 22న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడానికి ప్రయత్నిస్తామని, తదుపరి షెడ్యూల్‌పై ఎన్నికల అధికారి సుధీర్ త్రిపాఠి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాఖ్య వర్గాలు తెలిపాయి. మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుపై హాకీ ఒడిశా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రక్రియ ఎలా పూర్తవుతుందో, తాను మళ్లీ పోటీ చేస్తానో లేదో తెలియదు కానీ, హాకీ ఒడిశాపై విధించిన అక్రమ సస్పెన్షన్ రద్దు కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
-
Bronson Reed: రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ప్రముఖ WWE స్టార్ కన్నుమూత..
-
Preethi Mukundan: ప్రీతి ముకుందన్ లేడీ ఓరిఎంటెడ్ మూవీ?
-
Vrushakarma: ‘కింగ్ 100’లో నాగచైతన్య గెస్ట్ రోల్? ఒక్క మాటతో హింట్ ఇచ్చేసిన చైతూ!
-
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో విషాదం.. పాఠశాల పక్కన భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థులు మృతి..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!