Arjun: రాముడి కథతో ‘యాక్షన్ కింగ్’ అర్జున్ భారీ స్కెచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనదైన నటనతో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు ‘యాక్షన్ కింగ్’ అర్జున్ అంటేనే దేశభక్తి, పవర్ఫుల్ యాక్షన్ గుర్తొస్తాయి. ఇప్పుడు ఆయన మరోసారి తన మార్క్ చూపించేందుకు ఏకంగా అయోధ్యనే వేదికగా ఎంచుకున్నారని ప్రకటన వచ్చింది. అర్జున్ ఒక పక్క హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న కొత్త పాన్ ఇండియా సినిమా రేపు (నవంబర్ 27) అయోధ్యలోని పవిత్ర రామ జన్మభూమి ఆలయంలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. సాధారణంగా సినిమాల పూజా కార్యక్రమాలు స్టూడియోల్లోనో, స్థానిక ఆలయాల్లోనో జరుగుతుంటాయి. కానీ ఏకంగా అయోధ్య రామమందిరంలో సినిమాను లాంచ్ చేసి, అక్కడే టైటిల్ ప్రకటించబోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
దీనితో ఈ సినిమా కథ శ్రీరాముడు, రామాయణం నేపథ్యంతో ముడిపడి ఉంటుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకడానికి మరో బలమైన కారణం ఉంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నది సాధారణ రచయిత కాదు.. ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి! మేజర్ విజయ్ భార్గవన్ ఈ కథను సిద్ధం చేశారు. ఒక ఆర్మీ ఆఫీసర్ కలం నుంచి వస్తున్న కథ కావడంతో ఇందులో దేశభక్తి, సైనికుల త్యాగం, ధైర్యసాహసాలతో పాటు భారత్ గర్వించే అంశాలు బలంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఒకవైపు అయోధ్య రాముడి సెంటిమెంట్, మరోవైపు గుండెలు ఉప్పొంగే దేశభక్తి.. ఈ రెండూ కలిస్తే బాక్సాఫీస్ వద్ద పూనకాలు ఖాయమని అభిమానులు అంటున్నారు.
Also Read
ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అనూప్ మోహన్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఒక భాషకు పరిమితమయ్యే సినిమా కాదు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్ర తారలు, ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నారు. రేపు అయోధ్యలో జరగనున్న ఈ వేడుకకు భారతీయ సినీ పరిశ్రమలోని ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన అతిథులు హాజరుకానున్నారు. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఒక అద్భుత ప్రయాణం అయోధ్య నుంచే మొదలవుతోందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. మరి అయోధ్య సాక్షిగా అర్జున్ ప్రకటించబోయే ఆ సెన్సేషనల్ టైటిల్ ఏంటో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే!
తాజావార్తలు
-
Arjun: రాముడి కథతో ‘యాక్షన్ కింగ్’ అర్జున్ భారీ స్కెచ్
-
EPFO: PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి కొత్త సదుపాయం..?
-
SP Manifesto: 5 రూపాయలకే భోజనం, మహిళలకు ఏటా రూ.40 వేలు.. ఎస్పీ మేనిఫెస్టోలో భారీ హామీలు..
-
ENE Repeat : ఫస్ట్ వీక్‌లోనే ‘ఈ నగరానికి ఏమైంది 2’ బ్రేక్ ఈవెన్
-
CJP: సీజేపీకి బిగ్ షాక్.. దీప్కే, దాస్, రాంకాలకు లుకౌట్ నోటీసులు!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!