OTR: ఆ మంత్రి పరిస్థితి ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉందా?
- మంత్రి ఆనంకు తెలియకుండానే జిల్లా స్థాయిలో నిర్ణయాలు..
- జరుగుతున్న పరిణామాలపై మినిస్టర్ తీవ్ర అసంతృప్తి..
- ఆత్మకూరులో పంటికింద రాయిలా మారిన జనసేన నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మంత్రి పరిస్థితి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉందా? ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మిత్రపక్షంతో, జిల్లాలో సొంత పార్టీ నేతలతో ఆయన సతమతం అవుతున్నారా? అవడానికి స్టేట్ మినిస్టర్ అయినా… లోకల్ వ్యవహారాలను చక్కదిద్దులేకపోతున్నారా? ఎవరా టీడీపీ మినిస్టర్? పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం, జనసేన నేతలు కలిసి ఏం చేస్తున్నారు?
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి ఇప్పుడు సింహపురి పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయింది. ఆయనకు తెలియకుండానే జిల్లా స్థాయిలో పార్టీ నిర్ణయాలు జరిగిపోతున్నాయి. కనీసం సభలు, సమావేశాలకు కూడా ఆహ్వానం ఉండటం లేదట. జిల్లా స్థాయి ప్రోటోకాల్ పదవుల ఎంపికలో కనీసం ఆయన అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడంలేదని చెప్పుకుంటున్నారు. దీంతో జిల్లా పార్టీ నాయకత్వం మీద, జిల్లాలో పెత్తనం చేస్తున్న వారిపై మంత్రి అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఒకవైపు డిస్ట్రిక్ట్ లెవల్లో సొంత పార్టీ వ్యవహారం అలా ఉంటే…ఇప్పుడు సొంత నియోజకవర్గంలో జనసేన పంటి కింద రాయిలా మారిందని అంటున్నారు.
Also Read
అందుకు ఇటీవల జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికే మంచి ఉదాహరణ అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఉమ్మడి నెల్లూరులో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది ఆనం కుటుంబానికి. రాపూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో రామనారాయణరెడ్డికి భారీ అనుచర గణం ఉంది.ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి పోటీ చేసి గెలిచారాయన. ఇక్కడ మొదట్నుంచి జనసేనతో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయట. మున్సిపల్ ఎన్నికల సమయంలో అవి శృతి మించి పోయాయని అంటున్నారు. పొత్తులో భాగంగా మున్సిపాలిటీలో జనసేనకు రెండు స్థానాలు కేటాయించారు. కానీ… ఆ పార్టీ నాయకులు కొన్ని చోట్ల రెబెల్స్‌గా పోటీ చేసి పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేశారు. మొత్తంగా నాలుగు చోట్ల జనసేన అభ్యర్ధులు గెలిచారు. 1, 6 వార్డుల్లో అధికారికంగా జనసేన అభ్యర్థులకు మంత్రి ఆనం సహాయ సహకారాలు అందించి గెలిపించారు. మిగిలిన రెండు చోట్ల రెబెల్స్ పోటీ చెయ్యడంతో అక్కడ టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు.
వాళ్ళతో విత్ డ్రా చేయించాలని జనసేన ఇంచార్జ్ శ్రీధర్ని అడిగినా అందుకాయన ససేమిరా అన్నారట. ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్‌గా డాక్టర్ షకీలా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 11వ వార్డులో జనసేన రెబల్ గా పోటీ చేసి గెలిచిన తన భార్య శిరీషకు వైస్ చైర్మన్ పదవి ఇప్పించుకున్నారు ఇంచార్జ్ శ్రీధర్. అందుకు అధిష్టానం వద్ద ఉన్న తన పలుకుబడిని గట్టిగా వాడారట ఆయన. ఇది మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అస్సలు నచ్చలేదు. అలాగే..టిడిపి సభ్యులతో పాటు.. జనసేనలో ఉన్న మరో ఇద్దరు కౌన్సిలర్స్ సైతం శిరీషకు డిప్యూటీ ఇచ్చేందుకు నో చెప్పినట్టు సమాచారం. ఆ క్రమంలో… జనసేన కోటాలోనే 6 వార్డు నుంచి గెలిచిన పద్మజకు మంత్రి సిఫారసుతో మొదట వైస్ ఛైర్మన్ ఇచ్చారు. అయితే.. ఈ వ్యవహారం పవన్ దృష్టికి వెళ్లడంతో.. ఆ ఎన్నికను రద్దు చేసిన జిల్లా యంత్రాంగం.. మరోసారి వైస్ చైర్మన్ ఎన్నిక జరపగా.. చివరికి చేసేదేమీ లేక.. శిరీషను వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నట్టు చెబుతున్నారు.
సరిగ్గా ఇక్కడే ఆనం బాగా హర్ట్ అయ్యారని అంటున్నారు. అసలు మంత్రి, శ్రీధర్‌కు చాలా రోజుల నుంచి పడటం లేదని చెప్పుకుంటున్నారు. ఇక జనసేన రెబెల్స్ పోటీ చేసిన రెండు స్థానాల్లోని అభ్యర్థులకు మంత్రిని వ్యతిరేకించే ఓ కీలక నేత ఆర్థిక సహకారం అందించారన్న ప్రచారం ఉంది. జనసేన ఇంచార్జ్ శ్రీధర్ కావాలనే రెబెల్స్‌ను బరిలోకి దించి పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేశారన్నది మంత్రి ఆగ్రహం. జనసేనలో ఉంటూ.. వైసీపీ నేతలతో పాటు.. ఆనం వ్యతిరేక వర్గాలతో టచ్ లో ఉన్నారని.. తనను శ్రీధర్ అంతర్గతంగా ఇబ్బంది పెడుతున్నారనేది మంత్రి ఆనం అవేదన. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత ప్రాధాన్యత ఇచ్చినా…. తన రాజకీయాల కోసం ఆయన తన వ్యతిరేక వర్గంతో చేతులు కలిపారంటూ మంత్రి తన సన్నిహితుల దగ్గర అంటున్నట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండే తనకు లోకల్ నేతలు అనుకూలంగా లేరని ఆనం అంటున్నారట. ఓ వైపు నియోజకవర్గంలో జనసేనతో.. మరోవైపు జిల్లాలో సొంత పార్టీలోని వ్యతిరేకులతో ఫైటింగ్ చేయాల్సిరావడాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారట.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
OTR: ఆ మంత్రి పరిస్థితి ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉందా?
-
OTR: ‘నశా ముక్త్ భారత్’ వెనుక కేంద్ర మంత్రి అసలు ప్లాన్ ఇదేనా?
-
Off The Record: ‘ఎవర్రా వీళ్లంతా..?’ అంటూ జనసైనికుల ఫైర్
-
Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
-
IFFI 2026: గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మెగాస్టార్ సినిమా సందడి.. దేశవ్యాప్తంగా ఆ 5 చిత్రాల్లో ఒకటిగా రికార్డ్!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!