ENE Repeat : ఫస్ట్ వీక్‌లోనే ‘ఈ నగరానికి ఏమైంది 2’ బ్రేక్ ఈవెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ENE 2 Collections : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది 2’. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, అటు యూఎస్ మార్కెట్లో కూడా సాలిడ్ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్‌ను అందుకున్న ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేలోగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుందని మేకర్స్ ప్రకటించారు. మరి మొత్తానికి ఈ మూవీ కలెక్షన్స్ ఎంత వసూలయ్యాయి అన్నది ఒకసారి చూస్తే..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఖాతాలో ఈ మధ్య బ్లాక్‌బస్టర్ సినిమా పడలేదన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ హీరో ‘ఈ నగరానికి ఏమైంది 2’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మొత్తం వారం రోజుల రన్ని ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా పూర్తి చేసుకోగా, ఈ మూవీ మేకర్స్ 7 రోజుల వసూళ్లు ఇప్పుడు రివీల్ చేశారు. ఈ సినిమాకి మొత్తం రూ. 51.8 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా ప్రకటించారు. దీంతో ‘ఈ నగరానికి ఏమైంది 2’ మొదటి పార్ట్‌తో పోలిస్తే పెద్ద మార్జిన్ వసూళ్లే అందుకుందని చెప్పాలి. ఇక ఈరోజుతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయినట్టు చెబుతున్నారు. ఇదే జోష్‌లో కలెక్షన్స్‌ను అందుకుంటే మాత్రమే కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Also Read
ప్రస్తుతం థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, వారంలోపు మూవీకి రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంటే ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. సినిమాకు 22 కోట్ల ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఈ మూవీకి ఓటీటీ నుంచి కూడా కోట్లు అందుకోనుందని తెలుస్తోంది. మొత్తానికి మొదటి వారం కలెక్షన్స్ ఊహించని రేంజ్లో రావడంతో రెండో వారం కలెక్షన్స్‌పై సస్పెన్స్ మొదలైంది. ఇక ఫైనల్‌గా కలెక్షన్స్ ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అభినవ్ గోమఠం, సతీష్ మాగంటి, వెంకటేష్ కాకమాను, శివాత్మిక రాజశేఖర్ తదితరులు నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. అలాగే సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాణం వహించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!