Bala 369 : “సినిమా బాగాలేకపోతే పది మందికి చెప్పండి!”.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సినిమా రిలీజ్‌కు ముందు ప్రతి హీరో తమ సినిమా బాగుందని చెప్పుకోవడం సహజం. కానీ, ‘బాల 369’ హీరో అర్విన్ తేజ్ మాత్రం ఒకడుగు ముందుకేసి ఏకంగా ప్రేక్షకులకే ఓ బోల్డ్ సవాల్ విసిరాడు. “మీరు థియేటర్‌కు రండి.. సినిమా బాగాలేకపోతే పది మందికి చెప్పండి, బాగుంటే మాత్రం ఒక్కరికి చెప్పండి!” అంటూ సినిమా కంటెంట్‌పై తనకున్న అపారమైన నమ్మకాన్ని చాటుకున్నాడు. ‘జయమ్మ పంచాయతీ’ ఫేమ్ విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో, ‘అటజని కంచె’ అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. వైవా హర్ష సమర్పణలో అర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య నిర్మించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన హీరో నిఖిల్ సిద్ధార్థ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సినిమా కాన్సెప్ట్ తనను ఎంతగానో ఆకట్టుకుందని హీరో నిఖిల్ సిద్ధార్థ అన్నారు. “ఇంత పరిమిత బడ్జెట్లో ఏకంగా 15 దేశాల్లో సినిమా షూట్ చేయడం మామూలు విషయం కాదు. థియేటర్లో కూర్చుని ఒక ప్రపంచ యాత్ర చేసిన అనుభూతి కావాలంటే ‘బాల 369’కి రండి. సినిమా బాగుంటే, మంచి స్పాన్ ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారు” అని నిఖిల్ పేర్కొన్నారు. స్వతహాగా ఎదిగిన వైవా హర్ష ఈ సినిమాతో ప్రజెంటర్‌గా మారడం ఇన్స్పిరేషనల్ అని, అర్విన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని, విజయ్ కుమార్ ఈ సినిమాతో పెద్ద కమర్షియల్ సక్సెస్ కొట్టబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
ఈ వేడుకలో దర్శకుడు విజయ్ కుమార్ పంచుకున్న ఓ షూటింగ్ అనుభవం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాశ్మీర్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ కృష్ణానగర్ నుంచి కొన్ని నకిలీ తుపాకులు తీసుకెళ్తుండగా, ఎయిర్‌పోర్టులో పోలీసులు, ఆర్మీ అధికారులు తనను చుట్టుముట్టి గంటపాటు విచారించారని, చివరికి తాను సినిమా డైరెక్టర్‌నని తెలిశాక వదిలేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’లోని ‘అటజని కాంచె’ పద్యం స్ఫూర్తితో ఈ కథ రాశానని, ఈ సినిమాను తెలుగు ఉపాధ్యాయులందరికీ అంకితం చేస్తున్నానని తెలిపారు. వైవా హర్ష, గెటప్ శీను, వెన్నెల కిషోర్ లాంటి సింగిల్ టేక్ ఆర్టిస్టులతో పనిచేయడం అద్భుతమైన అనుభవమని చెప్పారు.
తాజావార్తలు
-
Bala 369 : “సినిమా బాగాలేకపోతే పది మందికి చెప్పండి!”.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్!
-
Arjun: రాముడి కథతో ‘యాక్షన్ కింగ్’ అర్జున్ భారీ స్కెచ్
-
EPFO: PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి కొత్త సదుపాయం..?
-
SP Manifesto: 5 రూపాయలకే భోజనం, మహిళలకు ఏటా రూ.40 వేలు.. ఎస్పీ మేనిఫెస్టోలో భారీ హామీలు..
-
ENE Repeat : ఫస్ట్ వీక్‌లోనే ‘ఈ నగరానికి ఏమైంది 2’ బ్రేక్ ఈవెన్
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!