OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
- సీపీఎంకు ఇరకాటంగా ఏడాది క్రితం జరిగిన హత్య కేసు
- సీపీఎం వాళ్ళే హత్యకు బాధ్యులని చెప్పకనే చెప్పిన పోలీసులు
- పోలీస్ ప్రెస్ మీట్ వెనక రాజకీయ కోణాలపై చర్చలు
- ఏడాది క్రితం సీపీఎం నేత సామినేని రామారావు హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ పార్టీకి కష్టాలు ఎదురవుతున్నాయా? హత్య కేసుల అభియోగాలు ప్రత్యర్థులకు ఉపయోగ పడుతున్నాయా? అధికారంలో ఉన్నవాళ్ళు వాటిని అడ్డం పెట్టుకునే…ఆ లెఫ్ట్ పార్టీని లొంగదీసుకోవాలనుకుంటున్నారా? గతంలో బీఆర్ఎస్ అదే పని చేసిందా? ఇప్పుడు కాంగ్రెస్ కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవుతోందా? పవర్లో ఉన్న వాళ్ళు మద్దెల దరువేస్తున్న ఆ పార్టీ ఏది? ఏంటా మర్డర్ మేటర్స్? ఒకప్పుడు సీపీఎంకు ఆయువుపట్టు లాంటిది ఉమ్మడి ఖమ్మం జిల్లా. నాడు అధికారంలో ఉన్న పార్టీలు సైతం ఈ జిల్లా వరకు సీపీఎం చెప్పినట్టే వినేవి. ఇప్పుడా పట్టు అయితే… సడలి పోయిందిగానీ… బలంగానే ఉందన్నది పొలిటికల్ ఒపీనియన్. అయితే తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ పార్టీకి ఇక్కట్లు తెచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఏడాది క్రితం జరిగిన ఓ హత్య కేసు కామ్రేడ్స్‌ను ఇరుకున పెడుతోందంటున్నారు.
ఏడాదిగా నడుస్తున్న దర్యాప్తు వివరాలను పోలీసులు ఇప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు. సీపీఎంకు చెందిన వారే ఈ హత్యకు బాధ్యులంటూ చెప్పకనే చెప్పేశారు. హత్య చేసింది కాంగ్రెస్ వాళ్లేనంటూ ఇన్నాళ్ళుగా ఆందోళనలు చేస్తోంది లోకల్ సిపిఎం నాయకత్వం. సిట్ వేయాలంటూ సిఎంను కలిసి విజ్ఞప్తి చేశారు కూడా. అయితే గతంలో సిపిఎం నాయకత్వానికి అనుకూలంగా తెల్దార్‌పల్లిలో హత్యచేసిన వ్యక్తులే ఈ మర్డర్ కూడా చేశారంటూ పోలీస్ కమిషనర్ ప్రెస్మీట్లో చెప్పడం, ఇందుకు ఆర్థిక, రాజకీయ కారణాలు ఉన్నాయని వెల్లడించడం వెనక వేరే కారణాలు ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం నేత సామినేని రామారావును నిరుడు అక్టోబర్ 31న హత్య చేశారు. ఏడాది అవుతున్న టైంలో…. ఈ హత్య చేసింది గతంలో తెల్దార్ పల్లిలో తమ్మినేని కృష్ణయ్య హంతకులేనని తేల్చేశారు పోలీసులు. దీని ద్వారా… రామారావు హత్య వెనుక సిపిఎం వాళ్ళే ఉన్నట్టు చెప్పకనే చెప్పారు పోలీసులు.
Also Read
అయితే… గ్రామంలోని కాంగ్రెస్ వాళ్ళే చంపేశారని సామినేని భార్య ఫిర్యాదు చేశారు. కానీ పోలీస్ దర్యాప్తు మాత్రం కమ్యూనిస్ట్‌ల వైపే వేలు చూపించడం, సమీపంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో పోలీస్ ప్రకటనకు కావాల్సినంత పొలిటికల్ కలర్ వస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది లెఫ్ట్. సిట్ వేయాలని మేం కోరుతుంటే…పోలీసులు మాత్రం అధికార పార్టీ మెప్పుకోసం మామీదే రుద్దుతున్నారంటూ ఫైరవుతున్నారు కామ్రేడ్స్. ఇక 2022 ఆగస్టు 15న తెల్దార్‌పల్లి సమీపంలో ఓ హత్య జరిగింది. అందులో సీపీఎం సీనియర్ నేతను ముద్దాయిగా పెడతారని అంతా భావించారు. కానీ… ఆయన పేరు పెట్టకుండా తప్పించేశారని, అప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో ఈ అంశాన్ని ఈ అంశాన్ని బీఆర్ఎస్ వాడుకుందని చెప్పుకుంటారు. ఆ ముఖ్య నాయకుడిని కేసు నుంచి తప్పించినందుకే నాడు సీపీఎం… బీఆర్ఎస్కు మద్దతిచ్చిందన్న ప్రచారం గట్టిగానే జరిగింది.
ఇక ఆ బైపోల్లో తప్ప… ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరలేదు. కట్ చేస్తే…. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల సీటు గెలవడం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం కూడా. ఈ పరిస్థితుల్లో… ఉమ్మడి ఖమ్మంలో బలంగా ఉన్న సీపీఎం సపోర్ట్ చేస్తే అది కచ్చితంగా ప్లస్ అవుతుంది. దాంతో… మద్దతు దిశగా ఆ పార్టీ మీద వత్తిడి తీసుకురావడానికే…. ఇప్పుడు అకస్మాత్తుగా ఏడాది క్రితం జరిగిన హత్య కేసు తెరపైకి వచ్చిందా అన్న సందేహాలు ఉన్నాయట రాజకీయవర్గాల్లో. అయితే ఫలానా హత్య చేసిన వాళ్ళే ఈ మర్డర్ కూడా చేశారని పోలీసులు చెబుతున్నారేగానీ… వెనక ఎవరున్నారన్నది ఇంకా తేలలేదు. దీంతో… రాజకీయ కోణంలో సందేహాలు పెరుగుతున్నాయి వివిధ వర్గాల్లో. కచ్చితంగా పొలిటికల్ యాంగిల్ ఉందని, రాష్ట్ర రాజధాని నుంచి వచ్చిన ఆదేశాలతోనే… జిల్లా పోలీస్ యంత్రాంగం హడావిడి చేసిందన్నది సీపీఎం ఆరోపణ.
- Tags
- BRS
- CPM
- NTV Telugu
- OTR
- political news
తాజావార్తలు
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!