OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
- కేటీఆర్‌ను ఎక్స్ వేదికగా సారీ కోరిన కొండా సురేఖ
- అప్పట్లో తొందరపడి నిరాధార వ్యాఖ్యలు చేశానని పశ్చాత్తాపం
- రెండేళ్ళ క్రితం వ్యాఖ్యలకు ఇప్పుడు సారీ ఎందుకు చెబుతున్నారు?
- కీలక పరిణామాలు జరగబోతున్నాయా అంటూ కొందరి ఎంక్వైరీలు
- బీఆర్ఎస్లో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారా అన్న చర్చ
- కాంగ్రెస్‌ని వీడబోనంటూ కొండా సురేఖ పరోక్ష సంకేతాలు
- కోర్ట్ కేసు కారణంగా న్యాయ నిపుణుల సలహాతోనే సారీ చెప్పారా?
- భవిష్యత్ రాజకీయ ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: మాజీ మంత్రి కొండా సురేఖ…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి గతంలో వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు పశ్చాత్తాపం ప్రకటించారు. దానికి సంబంధించి ఎక్స్ వేదికగా సారీ కోరడం, అందుకు సంబంధించి వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీని విమర్శించే క్రమంలోనే… ఆ వ్యాఖ్యలు చేశానని, కేటీఆర్ విషయంలో తనకు ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొన్నారు. తొందరపడి నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కొండా సురేఖ. తన వ్యాఖ్యల వల్ల కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే క్షమించాలని కూడా కోరారు. గతంలో తాను చేసిన నిరాధార వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారామె. సుమారు రెండేళ్ల క్రితం కేటీఆర్‌ను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు మాజీ మంత్రి ఇప్పుడు వివరణ ఇవ్వడం వెనకున్న వ్యూహం ఏంటా అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్‌లు పెడుతున్నారు చాలామంది. అదే సమయంలో… ఇదేం ఆషామాషీగా చెప్పిన క్షమాపణ కాదని, సారీ కే పీఛే చాలా ఉందంటూ కాస్త సెటైరిక్ కామెంట్స్ చేసే వాళ్ళు సైతం ఎక్కువ మందే ఉన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే… తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయా అంటూ సందేహం వ్యక్తం చేసేవాళ్ళు సైతం ఉన్నారు.
రెండేళ్ళ క్రితం…. అప్పట్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ కేటీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయగా… బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ వివాదం రాజకీయాలకే పరిమితం కాకుండా న్యాయస్థానాల వరకు వెళ్లింది. ఇక మంత్రి పదవి పోయాక… కొంత మౌనంగా ఉన్న సురేఖ రెండేళ్ళ తర్వాత సారీ చెప్పడం వెనక భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉండి ఉండవచ్చని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. తిరిగి గులాబీ దళంలో చేరడం కోసం ఆమె లైన్ క్లియర్ చేసుకుంటున్నారా అన్న గుసగుసలు బాగా పెరిగిపోతున్నాయి. అయితే… కేటీఆర్ కుటుంబానికి క్షమాపణ చెప్తూ పోస్ట్ పెట్టిన వెంటనే…. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి సంబంధించి కూడా మరో పోస్ట్ పెట్టడంతో ఆమె ఇప్పటికిప్పుడు గాంధీభవన్ గడప దాటబోరని విశ్లేషిస్తున్నారు కొందరు. నవంబర్ 1న ఢిల్లీలో జరగబోతున్న నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొనాలని కోరడం ద్వారా…తాను హస్తాన్ని వీడటంలేదని పరోక్ష సంకేతం పంపినట్టు కూడా అంచనా వేస్తున్నారు.
Also Read
- OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
- OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
- Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
కానీ…. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరితో శత్రుత్వం పెంచుకోకూడదన్న ఉద్దేశంతోనే సారీ, వివరణ ఇచ్చి ఉండవచ్చంటున్నారు. ఇక కోర్ట్‌లో కేసు ఉన్నందున న్యాయ నిపుణుల సలహా మేరకు అలా వ్యవహరించి ఉండవచ్చన్నది ఇంకో వెర్షన్. క్యాబినెట్ నుంచి తప్పించాక ఆచితూచి అడుగులు వేసే ప్రయత్నంలో ఉన్నారు కొండా. ఆ క్రమంలోనే… భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దూకుడుగా వెళ్లకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాన్ని మార్చుకుంటూ… న్యాయ పరమైన చిక్కులు రాకుండా, అదే సమయంలో భవిష్యత్‌లో రాజకీయ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే ప్రయత్నంలో భాగంగానే మాజీ మంత్రి సారీ మంత్రం పఠించి ఉంచవచ్చంటున్నారు. అయితే దీనిపై… సొంత పార్టీ నేతలు మాత్రం కాస్త డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. ఈ సారీ ఏదో…. అప్పుడే కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పి ఉంటే…. మంత్రి పదవి దక్కేది కదా అంటూ కామెంట్ చేస్తున్నారు హస్తం నేతలు కొందరు.
- Tags
- BRS
- congress
- konda surekha
- ktr
- OTR
తాజావార్తలు
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!