Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet Singh: రామాయణం కథ ఆధారంగా దర్శకుడు నితేశ్ తివారీ తీస్తున్న భారీ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ‘శూర్పణఖ’ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బయటకు వదిలారు. ‘జనస్థాన యువరాణి శూర్పణఖ’ అంటూ రిలీజ్ చేసిన ఆ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్.. శూర్పణఖ క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. శూర్పణఖ పాత్ర చేయడం తనకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందని రకుల్ చెప్పారు.
“రామాయణంలో యుద్ధం జరగడానికి అసలు కారణాల్లో శూర్పణఖ పాత్ర చాలా ముఖ్యం. కానీ ఈ విషయం చాలామందికి సరిగ్గా తెలీదు. ఆమెను అందరూ తప్పుగానే అర్థం చేసుకున్నారు. ఈ సినిమాలో శూర్పణఖను ఎవరూ చూడని ఒక కొత్త యాంగిల్లో చూపించబోతున్నారు. అలాంటి క్యారెక్టర్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది” అని ఆమె అన్నారు. తరతరాలుగా మనందరి గుండెల్లో నిలిచిపోయిన ఇంత పెద్ద కథలో తను భాగం కావడం చాలా గొప్ప విషయమని రకుల్ చెప్పారు. “ప్రపంచం మొత్తానికి మన చరిత్రను, గొప్పదనాన్ని చూపించే సినిమా ఇది. ఇలాంటి కథలో చాలా రకాల షేడ్స్ ఉన్న పాత్ర దొరకడం నా అదృష్టం. తెరపై నా క్యారెక్టర్‌ను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని చాలా ఆత్రుతగా ఉంది” అని ముగించారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి రోల్లో సన్నీ దేవోల్ కనిపిస్తారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నవంబర్ 5న థియేటర్లలోకి రానుంది.
Also Read
Jansthan ki Rajkumari, Surpanakha.
Rakul Preet Singh as Surpanakha.Experience Ramayana in cinemas worldwide from November 5, across all premium formats. https://t.co/jcKxZnpzNd
— The World Of Ramayana (@WorldOfRamayana) October 30, 2026
తాజావార్తలు
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
-
Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!