Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాన్ని 13 ప్రధాన విభాగాలుగా విభజించి.. వాటిని 89 సెక్టార్లుగా రూపొందించారు. ప్రతి సెక్టార్లో 80 నుంచి 100 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. మొత్తం భద్రతా ఏర్పాట్లను 30 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ, ఏడీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యక్షంగా బందోబస్తును సమన్వయం చేస్తున్నారు. సభా ప్రాంగణం, ఎయిర్పోర్ట్ జోన్, వీఐపీ రూట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు భోగాపురానికి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు మంగళగిరి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న ఆయన.. అక్కడి నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భోగాపురానికి చేరుకోనున్న పవన్.. అక్కడి మిరాకిల్ సిటీ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు. శనివారం ఉదయం 10.45 గంటలకు గవర్నర్, సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత పవన్ హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా శుక్రవారం సాయంత్రం విశాఖపట్నానికి చేరుకోనున్నారు. సీఎం విశాఖకు చేరుకున్న అనంతరం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రి లోకేష్ నేరుగా భోగాపురానికి వెళ్లనున్నారు. ఇద్దరూ శనివారం జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రితో కలిసి పాల్గొననున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌కు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?