Off The Record: పొలిటికల్ రామం రెమోగా మారిపోయాడా? ఉనికి కోసం కాస్త ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారా? తన ఒరిజినాలిటీని పూర్తిగా పక్కకు నెట్టి… ట్రంకుపెట్టెలో పెట్టి తాళం వేసేశారా? అద్దెకు తెచ్చుకున్న ఆవేశంతో తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నారా? ఎవరా లీడర్? ఎందుకా మార్పు?
Read Also: DD Next level: సినిమాలో తిరుమల శ్రీవారిని అవమానిస్తూ పాట.. స్పందించిన నటుడు..
మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీరు ఉన్నట్టుండి మారిపోయింది. ఎంతటి సీరియస్ విషయాన్నయినా కూల్‌గా డీల్ చేసి తనదైన శైలిలో సాఫ్ట్ ముగింపు ఇచ్చే ఈటల భాష ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. తన సహజత్వానికి భిన్నంగా ఆయన చేస్తున్న ఎగ్రెసివ్ కామెంట్స్ నాలుగైదు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే క్రమంలో.. కఠినంగా మాట్లాడవచ్చుగానీ… ఈటల ప్రస్తుతం వాడుతున్న భాష మాత్రం తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందని అంటూ.. అదే రేంజ్‌లో కౌంటర్స్ వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మొదట్నుంచి ఎగ్రెసివ్‌గా ఉండే నాయకులు అడ్డసుడిగా మాట్లాడారంటే అది వేరే లెక్క. కానీ… ఈటల రాజేందర్ లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న, గతంలో మంత్రిగా పని చేసి రకరకాల వ్యవహారాలను డీల్ చేసిన నాయకుడు ఎందుకిలా మాట్లాడుతున్నారంటూ ఇటు తెలంగాణ బీజేపీలో సైతం ఆశ్చర్యంగానే చూస్తున్నారట. అసలురాజేందర్ తన సహజ శైలికి భిన్నంగా ఎందుకిలా మాట్లాడుతున్నారన్న చర్చ మొదలైంది. ఈ తెచ్చిపెట్టుకున్న ఆవేశకావేశకాలన్నీ.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కోసమేనా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయట. అసలు బండి సంజయ్ తర్వాత ఆ పదవి తనకే వస్తుందని అనుకున్నారట ఈటల కానీ.. అప్పుడు కాదు, ఇప్పటికీ రాకపోవడంతో కాస్త డిస్టర్బ్ అయినట్టున్నారని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.
Read Also: Off The Record: టార్గెట్ గొట్టిపాటి..! బలరాంని అద్దంకికి మార్చే యోచనలో వైసీపీ..?
అయితే, సాధారణంగా బీజేపీలో ఎగ్రెసివ్ లీడర్స్‌కే ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. ఆ కోణంలో చూస్తే.. తన సాఫ్ట్ నేచరే మైనస్ మారుతోందని ఆయన భావిస్తున్నారా? అందుకే రొటీన్‌కు భిన్నంగా మాటలు తూలుతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయట. మేడ్చల్ కలెక్టర్ పరిధిలోని అంశాన్ని హైడ్రా మీద మోపడం సరికాదంటూ ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ వచ్చినా పట్టించుకోకుండా.. దానికి కొనసాగింపుగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకరమైన పదం వాడటంపై ఫైరవుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్సే కదా.. మనం ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నారో, లేక తనను తాను నిరూపించుకోవాలనుకుని తప్పులో కాలేస్తున్నారోగానీ.. కనీసం ముఖ్యమంత్రి స్థాయికి కూడా విలువ ఇవ్వకుండా ఈటల బజారు భాష వాడటం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఆ వ్యాఖ్యల మీద పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. అక్కడితో అది ముగుస్తుందని అనుకున్నా.. కొనసాగింపునిచ్చారు ఈటల. ధీరులతో యుద్ధం చేయొచ్చు కానీ డ్యాష్‌లతో కాదు అంటూ మరోసారి స్లిప్ అయ్యారు రాజేందర్. ఆ దెబ్బకు అది జగ్గారెడ్డి వర్సెస్ రాజేందర్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే.. భువనగిరి ఎంపీ చామల కిరణ్ మరో అడుగు ముందుకేసి లెఫ్ట్ నుంచి రైట్‌కి వెళ్లిన ఈటలకు రైట్ పార్ట్ పనిచేయడం లేదంటూ కామెంట్ చేశారు. అయితే ఇక్కడే మరో చర్చ జరుగుతోంది.
Read Also: Off The Record: నామినేటెడ్ పోస్టుల చిచ్చు..! కూటమి ప్రభుత్వంలో అసంతృప్తులు పెరుగుతున్నాయా?
ఇక, ఈ విషయంలో ఈటల అంచనాలు తల్లకిందులై ఉండవచ్చని, తాను మృదు స్వభానికి కాదు, దూకుడున్న వ్యక్తిని అని చెప్పుకునే ప్రయత్నంలో అభాసుపాలవుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. ఏదో ఆశించి ఈటల తన ఒరిజినల్ కేరక్టర్‌ని మార్చుకుని అన్న మాటలు బూమరాంగ్ అయ్యాయన్న అభిప్రాయం మాత్రం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. పోనీ.. సీఎంని అంతలేసి మాటలు అన్నందుకు సొంత పార్టీ నాయకులు ఎవరన్నా వెనకేసుకు వచ్చే పరిస్థితి ఉందా అంటే.. అంత సీన్ లేదన్నదే బీజేపీ సమాధానం. ఈటల మాటలకు కాంగ్రెస్ సైలెంట్‌గా ఉంటుందని అనుకున్నా.. జగ్గారెడ్డి రియాక్షన్‌తో మేటర్ సీరియస్ అయింది. దీన్ని బట్టి కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా రియాక్ట్ అవడం, ప్రతిపక్షాలకు కౌంటర్ వేయడం నేర్చుకోవాలన్న చర్చ గాంధీభవన్‌లో మొదలైందట.