Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- కోర్ట్ తీర్పు మాకు బిగ్ రిలీఫ్ అంటున్న బీఆర్‌ఎస్
- ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలని మేం ఎక్కడా చెప్పలేదంటున్న సర్కార్
- విజిలెన్స్, NDSA రిపోర్ట్‌ల ఆధారంగా ఇప్పటికే అధికారుల మీద చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? హైకోర్ట్ తీర్పును తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉంటే…. సర్కార్ యాక్షన్ సంగతేటి? అసలు కోర్ట్ ఏం చెప్పింది…., ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ… నిగ్గు తేల్చేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే… ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తాజాగా తీర్పు ఇచ్చింది రాష్ట్ర హైకోర్ట్. దీంతో… ఆ తీర్పుపై నెక్స్ట్ ఏం చేయాలా అన్న చర్చలు నడుస్తున్నాయి ప్రభుత్వంలో. అటు ప్రతిపక్షం బీఆర్ఎస్ జడ్జిమెంట్ తమకు అనుకూలంగా వచ్చిందని ప్రకటించుకుంది. ఇందులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఉన్నతాధికారులకు కూడా ఊరట లభించిందన్నది విపక్షం ఫీలింగ్. ఈ పరిస్థితుల్లో సర్కార్ చర్యలేంటన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికైతే…. హైకోర్ట్ తీర్పుపై ప్రభుత్వం కూల్‌గానే ఉందట. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోర్ట్ చెప్పిందన్నది ప్రభుత్వ వాదన. అయినా…కాళేశ్వరంపై చర్యలు తీసుకోవడానికి కమిషన్ నివేదికనే ఆధారంగా తీసుకున్నామని మేం ఎక్కడా చెప్పలేదని కూడా అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇప్పటికే NDSA, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్టుల ఆధారంగా సాగునీటి శాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. అలాగే… హైకోర్టులో కూడా కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదన్న సంగతి గుర్తు చేస్తున్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.
అయితే.. హైకోర్టు తీర్పుపై మంత్రివర్గంలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైకోర్టు తీర్పు వెలువడ్డ వెంటనే సీఎం రేవంత్… మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. అసలు ఘోష్ కమిషన్ నియామకాన్నే క్వాష్ చేయాలని బీఆర్ఎస్ కోరుకున్నా…. కోర్టులో అది సాధ్యం కాలేదన్నది గవర్నమెంట్ అభిప్రాయం. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఇప్పుడిక సీబీఐ దర్యాప్తు అంశాన్ని స్పీడప్ చేసే ఆలోచనలో చేస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్‌లో చర్చించి అందరి అభిప్రాయాల ప్రకారం న్యాయ పోరాటం చేయడం ఇప్పుడు తెలంగాణ సర్కార్ ముందున్న ఫస్ట్ ఆప్షన్‌గా చెప్పుకుంటున్నారు. అసెంబ్లీలోనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా… అందులో ఎక్కడా ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా అని మెన్షన్ చేయలేదన్న సంగతి గుర్తు చేస్తోంది ప్రభుత్వం. అయితే… అటు బీఆర్ఎస్ మాత్రం కోర్ట్ తీర్పును రాజకీయంగా తనకు అనుకూలంగా మల్చుకునే పనిలో ఉంది. అదే సమయంలో అధికార పార్టీగా కాంగ్రెస్ కూడా అలాంటి ఎత్తుగడే వేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏ నివేదికతో సంబంధం లేకుండానే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా… బీజేపీ బీఆర్ఎస్‌ను కాపాడే ప్రయత్నం చేస్తోందని, రెండు పార్టీల మధ్య దోస్తీ కుదిరిందన్న లైన్ తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇలాంటి రకరకాల చర్చలు, పరిణామాల క్రమంలో కేబినెట్‌లో చర్చించాక యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది. లీగల్గా ముందుకు వెళ్తారా? పొలిటికల్ ప్లానింగ్ ఎలా ఉంటుందని గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..