Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ పోస్టులు పెడుతుంటాడు. తన ఫ్యామిలీతో గడిపే క్షణాలను కూడా పంచుకుంటాడు. వాటికి స్పెషల్ ఫొటోలను కూడా ఆడ్ చేస్తుంటాడు. తాజాగా అలాంటి పోస్టు పెట్టాడు. తన తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ పార్టీకి వెళ్లిన పిక్స్ ను షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో తన తల్లితో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ను కూడా పంచుకున్నాడు. ‘మా అమ్మ సడెన్ గా నాకు మెసేజ్ చేసింది. ఈ వీకెండ్ డిన్నర్ కు వెళ్లడానికి మీకు వీలవుతుందా అని అడిగింది.
Read Also : Samantha : మాకు సినిమా చూపించడానికి అమ్మ చాలా కష్టపడింది
వెంటనే వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఈ బిజీ లైఫ్ లో తల్లిదండ్రులకు కూడా టైమ్ ఇవ్వండి. వాళ్లకు మన ప్రేమను పంచండి’ అంటూ రాసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఆయన చేసిన ఈ పోస్టులో పేరెంట్స్ తో పాటు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
ఇవి చూసిన విజయ్ ఫ్యాన్స్ నువ్వు ఇంత బిజీగా ఉన్నా నీ ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీతో జులై 4న రాబోతున్నాడు. ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్లతో పాటు ఇంకో మూడు సినిమాలను లైన్ లో పెట్టే పనుల్లో ఉన్నాడు. వరుసగా షూటింగులు ప్లాన్ చేసుకుంటున్నాడు.
Read Also : Maharashtra: తన కళ్ల ముందే పంట నాశనమవడం చూసిన రైతు ఏం చేశాడో చూడండి (వీడియో)
Mum suddenly asked if we could go out for dinner. And it had been very long since we went out, just us. As we are all always chasing work and goals.. forgetting to live sometimes :))
So last night we went out and had such a good timee :)) don’t forget to spend time with your mum… pic.twitter.com/zTB5F4Fw1W
— Vijay Deverakonda (@TheDeverakonda) May 16, 2025