Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- కారు గేరు మార్చాల్సిందేనని సారు డిసైడయ్యారా?
- ఎర్రవల్లి నివాసం వేదికగా ప్రక్షాళనకు సిద్దమయ్యారా?
- ఎర్రవల్లి హైలెవల్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు వుంటాయా?
- సంస్థాగత నిర్ణయాలను నేతలకు స్పష్టం చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో BRS పార్టీ యాక్టివిటీ మరింత పెంచనుందా? కారుకు రిపేరు చేసి గేరు మార్చాలని డిసైడయ్యిందా? ఎర్రవల్లిలో జరిగే సమావేశంలో గులాబీ బాస్ మరమ్మత్తులు చేసి పొలిటికల్ రేస్‌కు కారును సిద్దం చేస్తారా? తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. ఒకవైపు బెంగాల్ ఫార్ములాతో బీజేపీ దూకుడు పెంచుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సైలెంట్‌గా ఉన్న కారు.. ఇప్పుడు గేరు మార్చాల్సిన సమయం వచ్చిందని డిసైడ్ అయ్యారు అధినేత కేసీఆర్. బీజేపీ దూకుడుతో పార్టీలో కొత్త టెన్షన్ మొదలు కాకముందే నేరుగా అధినేతనే రంగంలోకి దిగారు. ఈనెల 12న మంగళవారం ఎర్రవెల్లి నివాసం వేదికగా హై లెవల్ మీటింగ్ జరగబోతోంది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన కీలక నేతలు హాజరుకాబోతున్నారు. కేసీఆర్ అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశంలో ఆయన తీసుకునే నిర్ణయాలపై పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
విజువల్స్
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
- OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
- OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
ఎర్రవెల్లి సమావేశం సాధారణ సమావేశం కాదంటున్నాయి పార్టీ శ్రేణులు. సుమారు పదేళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతంపై కీలక దృష్టి పెట్టారని చెబుతున్నారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను నేతలకు వివరించబోతున్నారట కేసీఆర్. సభ్యత్వ నమోదు నుంచి ఇన్ఛార్జుల నియామకం దాకా అన్నింటినీ ప్రక్షాళన చేయబోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న సభ్యత్వ నమోదును తక్షణమే ప్రారంభించాలని కెసిఆర్ భావిస్తున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారిగా ఇన్చార్జీలను సైతం ప్రకటించబోతున్నారు. రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించిన నేతలను సభ్యత్వ నమోదు కోసం ఇన్చార్జిలుగా పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా నేరుగా రాష్ట్ర ఇన్చార్జిలను నియమించబోతున్నారు.
ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్… గ్రౌండ్ లెవెల్ లో కొట్లాడాలంటే పార్టీ కమిటీలు వేయాలని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అందుకోసం పార్టీ నేతలకు ఉత్సాహం కలిగేలా పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేలా కొత్త కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. సాధారణ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం మాత్రమే ఉండటంతో కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయాలని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే సభ్యత్వ నమోదు తో పాటు కమిటీల ఏర్పాటు కూడా ఫైనల్ చేయబోతున్నారు. ఎర్రవల్లి సమావేశంలో ఇంకెలాంటి సంకేతాలు ఇస్తారోనని అందరూ వెయిట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!