Off The Record : పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ ఫోకస్ … కొత్త కమిటీలు ప్రకటన ?
- ఈనెల 27న బీఆర్‌ఎస్ కీలక నిర్ణయాలు ప్రకటించబోతోందా?
- టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారాక పార్టీ కమిటీలు లేని వైనం
- వరుస ఎన్నికలతో ఎప్పటికప్పుడు వాయిగా పర్వం
- అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టిందా? అందుకోసం గ్రౌండ్ లెవల్ నుంచి నరుక్కు రావాలని భావిస్తోందా? దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారా? ఎలా ఉంది గులాబీ దళం ప్లానింగ్? అధిష్టానం ఏం చేయబోతోంది? రజతోత్సవ వేడుకల్ని ఏడాదిగా జరుపుకుంటోంది బీఆర్‌ఎస్. ఈనెల 27న ముగింపు వేడుకలు నిర్వహించబోతోంది. తెలంగాణ భవన్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతారు. ఆరోజున చాలా కీలకమైన నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. గతంలో టీఆర్ఎస్…బీఆర్ఎస్ గా మారిన తర్వాత పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి స్థాయిలో జరగలేదు. 2022లో ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్ వెంటనే వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. తర్వాత పార్లమెంటు ఎన్నికలు కూడా రావడంతో కమిటీల విషయంలో ముందడుగు పడలేదు. ఈ క్రమంలో… నిరుడు రజతోత్సవ బహిరంగ సభ వేదిక పైనుంచి ప్రకటన చేశారు కేసీఆర్. ఈసారి గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేసుకుందామంటూ పిలుపునిచ్చారాయన.
కానీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు , మున్సిపల్ ఎన్నికలు వరుసగా రావడంతో కమిటీలు ఏర్పాటు వాయిదా పడుతూనే ఉంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో ఏ ఎన్నికలకు సంబంధించిన హడావుడి లేదు. దీంతో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారట పెద్దలు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉండడంతో.. ఆ లోపు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఖచ్చితంగా కమిటీల్ని నియమించాలన్న ప్లానింగ్ లో ఉంది బీఆర్ఎస్ అధిష్టానం. ప్రస్తుతం పార్టీకి కేవలం జిల్లా అధ్యక్షులు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో కొంతమంది ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో కొత్త కమిటీల నియామకం అనివార్యమైంది. గ్రామస్థాయి నుంచి నియమించాలనుకుంటున్నా సాధ్యాసాధ్యాలపై కొన్ని అనుమానాలున్నాయి. గ్రామ పార్టీ కమిటీలు వేయాలంటే ఖచ్చితంగా సభ్యత్వాల నమోదు తర్వాతనే అంటున్నాయి పార్టీ వర్గాలు. అందుకే ప్రస్తుతం సభ్యత్వంతో సంబంధం లేకుండా ఉండే మండల కమిటీల నుంచి మొదలుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో ఎన్నికల మూడ్ మొదలు అవుతుంది. అందుకే ప్రతిపక్ష పార్టీగా కమిటీల్ని పూర్తి చేసి దూకుడు పెంటాలని భావిస్తున్నట్టు సమాచారం.
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Tags
- BRS
- NTV Telugu
- OTR
- telangana
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?