Off The Record: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మరో వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతున్నారా? యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్న సీనియర్ లీడర్ తన కుమార్తె కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? నాకు ఇచ్చే గౌరవ మర్యాదలన్నీ ఆమెకు కూడా ఇవ్వాలని అనుచరులకు చెప్పేస్తున్నారా? ఇన్నాళ్లు రోగులకు చికిత్స చేశాను, ఇక నాన్న బాటలో పొలిటికల్ ట్రీట్‌మెంట్ ఇస్తానంటున్న ఆ వారసురాలెవరు? ఏ జిల్లాలో యాక్టివ్ అవుతున్నారు?
Off The Record: భీమిలి మీద పట్టుకోసం గంటా, శ్రీ భరత్ రాజకీయం..!
బొత్స సత్యనారాయణ. పొలిటికల్‌సర్కిల్స్‌లో అస్సలు పరిచయం అక్కర్లేని పేరు. పొజిషన్‌లో ఉన్నా, అపోజిషన్‌లో ఉన్నా… పొలిటికల్ చాణక్యంలో దిట్ట అన్న పేరుంది ఆయనకు. విజయనగరం పాలిటిక్స్‌లో బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారట ఎక్స్ మినిస్టర్. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్నారు బొత్స. మారుతున్న రాజకీయ పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నారట ఆయన. ఆ క్రమంలోనే… తాను యాక్టివ్‌గా ఉన్నప్పుడే వారసుల్ని రాజకీయాల్లో సెటిల్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తన కుమార్తె బొత్స అనూష అసెంబ్లీలో అధ్యక్షా అంటే… చూసి మురిసిపోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ విషయంలో ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నట్టు సమాచారం.
బొత్స వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన గ్రౌండ్ వర్క్ గట్టిగానే జరుగుతోందట. ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు అనూష. ఆమె పొలిటికల్‌గా యాక్టివ్ అవుతున్నారనడానికి ఇదే సంకేతమని అంటున్నారు పరిశీలకులు. వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న తీరు, అందర్నీ కలుపుకుని పోయేందుకు చూపిస్తున్న చొరవ చూస్తుంటే… ఇది ఒక ప్లాన్డ్ పొలిటికల్ ఎంట్రీ అవుతుండవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయంగా అనూష తయారయ్యే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోందని సొంత కేడరే చెప్పుకుంటోంది. వృత్తి పరంగా డాక్టర్ అయిన అనూష… ఇటీవల సెగ్మెంట్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, కేడర్ మీటింగ్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు.
Off The Record: జాగృతి జనం బాటలో కవిత కాస్త డిఫరెంట్‌గా వ్యవహరిస్తున్నారా..?
ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డైరెక్టర్ గావున్న అనూష ప్రజల్లోకి వెళ్ళి వారికి కావల్సిన వైద్య సలహాలను అందిస్తున్నారు. అలాగే గుర్ల, మెరకముడిదాం మండలాల్లో అయితే… నాయకులు ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడ ప్రత్యక్షమైపోతున్నారట అనూష. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండిటిలో ఏదో ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దాని ద్వారా ముందు జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. తల్లి ఝాన్సీ తరహాలోనే అనూష కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తారని బొత్స అనుచరగణం చెప్పుకుంటోంది. మరోవైపు ఇటీవలి కాలంలో అనూష పర్యటనల మీద ప్రజల స్పందన గురించి కూడా ఆరా తీశారట బొత్స సత్యనారాయణ. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో… ఇప్పుడు కోరుకుంటున్నట్టు రేపు పరిస్థితులన్నీ అనుకూలించి తాను రాజ్యసభకు వెళితే… చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతల్ని అనూష చూసుకునేలా స్కెచ్ రెడీ చేస్తున్నారట. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నందున అప్పటికి ఎలాగోలా కుమార్తె సెట్ అవుతారన్న ఆలోచనలో ఉన్నారట బొత్స. ఓవరాల్‌గా ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసత్వం మాత్రం ఖాయమైపోయిందంటున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు.