Off The Record: ఘోర పరాజయం నుంచి కోలుకున్న వైసీపీ… క్రమంగా యాక్టివిటీ పెంచుతోంది. రాజకీయ పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ… నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మారుస్తూ… కేడర్ని రీ ఛార్జ్ మోడ్‌లోకి తీసుకువస్తోంది. అయితే… ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం పూర్తిగా మ్యూట్ మోడ్‌లో ఉండటం ఏంటో అర్ధంగాక దిక్కులు చూస్తున్నారట కార్యకర్తలు. అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకలాపాలు దాదాపుదా నిలిచిపోయినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పర్చూరు, చీరాలలో ఇంత వరకూ గెలుపు బోణీ చేయని వైసీపీ… అద్దంకిలో మాత్రం ఓసారి గెలిచినా… అది కూడా అప్పుడు పార్టీలో ఉన్న నేత గొట్టిపాటి రవికుమార్ వ్యక్తిగత ఇమేజ్ తోనే సాధ్యమైందని చెబుతుంటారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయాక అద్దంకిలో కూడా పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉందంటున్నారు. అసలీ మూడు సెగ్మెంట్స్ టీడీపీకి గట్టి పట్టున్నవి కావడంతో… ఫ్యాన్ నాయకులు చెమటోడ్చక తప్పడం లేదన్నది లోకల్ వాయిస్. అలాంటి చోట ఇంకా గట్టిగా పని చేయాల్సి ఉన్నా… ఇన్ఛార్జ్లు స్లో మోషన్ నుంచి బయటపడకపోవడంతో కేడర్ కూడా అంతే ఫీల్‌లో ఉందట.
Read Also: Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే దంపతులు టీడీపీని బెదిరిస్తున్నారా..?
అద్దంకి నియోజకవర్గానికి గత ఎన్నికలకు ముందు పాణెం చిన హనిమిరెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా ఇంపోర్ట్ చేసింది వైసీపీ అధిష్టానం. ఆయన సామర్ధ్యం మీద ఎన్నికలకు ముందు కేడర్ ఏవేవో ఆశలు పెట్టుకున్నా… గొట్టిపాటి హవా ముందు తేలిపోయారు. ఇక ఎన్నికలు పూర్తయి 15 నెలలు గడిచినా…అద్దంకికి చుట్టపు చూపులా వచ్చి వెళుతున్నారు తప్ప కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదట హనిమిరెడ్డి. ఓవైపు టీడీపీ నుంచి మంత్రి గొట్టిపాటి రవికుమార్ వంటి గట్టి ప్రత్యర్దిని ఎదుర్కోవాల్సిన వైసీపీ ఇన్ఛార్జ్ ఇనాక్టివ్‌గా ఉండటంతో… కేడర్ పరిస్థితి మరీ దయనీయమైపోయిందట. వైసీపీ ఆవిర్బావం తర్వాత 2014 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ ఇక్కడి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పుడు కూడా ఆయన వ్యక్తిగత ఇమేజ్ వల్లే సాధ్యమైందని అంటారు. 2019లో వైసీపీ హవాలో కూడా టీడీపీ తరపున అద్దంకి ఎమ్మెల్యేగా విజయం సాధించారు గొట్టిపాటి. ఇక 2024లో టీడీపీ నుంచే మరోసారి గెలిచి మంత్రి అయ్యారాయన. అలాంటి నేతను ఎదుర్కోవాలంటే ఆయనకు ధీటైన రాజకీయాలు చేయాల్సి ప్రతిపక్ష ఇన్ఛార్జ్ అస్సలు పట్టింపులేనితనంతో ఉండటం కారణంగా అద్దంకి వైసీపీ అచేతనంగా మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: UP: ఛీ ఛీ.. పని మనుషులు ఇలా కూడా చేస్తారా..? సీసీటీవీ ఫుటేజీలో బయటపడ్డ దుశ్చర్య..(వీడియో)
అటు పర్చూరు నియోజకవర్గంలో కూడా దాదాపు అదే పరిస్థితి. వైసీపీ ఆవిర్బావం తర్వాత ఇక్కడి కూడా ఒక్కసారీ… గెలవలేదు. 2014 నుంచి వరుసగా అభ్యర్దులు మారారే తప్ప గెలుపు సాధ్యం కాలేదు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యడం బాలాజీ ఫలితాల తర్వాత కనిపించకపోవటంతో గాదె మధుసూదన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది వైసీపీ.. ఆయన తండ్రి గాదె వెంకటరెడ్డికి ఇక్కడ సుదీర్ఘ కాలం చేసిన రాజకీయం ప్లస్ అవుతుందని భావించారు పార్టీ పెద్దలు. కానీ… గాదె మధు అంత యాక్టివ్ గా లేరన్నది పర్చూరు టాక్. వైసీపీ సీరియస్‌గా తీసుకున్న బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఆయన అంత తీవ్రంగా పరిగణించలేదట. ఏదో… చెప్పారు, చేశాం అన్నట్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప ఇంకా టాప్ గేర్ అందుకోలేదంటోంది పార్టీ కేడర్.
Read Also: Sachin Tendulkar: కాబోయే వదినతో కలిసి పైలేట్స్ స్టూడియో ప్రారంభించిన సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్
ఇక చీరాల నియోజకవర్గంలో కూడా ఇంచుమించు అదే పరిస్దితి ఉందట.. ఇక్కడ కూడా వైసీపీ ఇంత వరకూ బోణీ చేయలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం ఆ తర్వాత ఫ్యాన్ పార్టీకి మారటంతో ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నారు.. గత ఎన్నికలకు ముందు వరకూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే ఉంది కరణం ఫ్యామిలీ. ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు తండ్రి, కొడుకు. ఫలితాల అనంతరం వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉండాలని కరణం వెంకటేష్‌ను కోరినా…ఆయన సుముఖత వ్యక్తం చేయలేదట. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్ని కూడా మమ అనిపిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కరణం వారి రాజకీయం అద్దంకికి మారబోతోందని ప్రచారం జరుగుతున్నా.. అవునని కానీ.. కాదనిగానీ బలరాం వైపు నుంచి స్పందన ఉండటం లేదు. మొత్తం మీద ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్దితి అంతకంతకు దిగిపోతోందని సొంత పార్టీ కేడరే మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి పార్టీ అధిష్టానం రీ బూట్ చేస్తుందా అనువుగాని చోటని వదిలేస్తుందా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.