ఘోర పరాజయం నుంచి కోలుకున్న వైసీపీ... క్రమంగా యాక్టివిటీ పెంచుతోంది. రాజకీయ పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ... నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లను మారుస్తూ... కేడర్‌ని రీ ఛార్జ్ మోడ్‌లోకి తీసుకువస్తోంది. అయితే... ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం పూర్తిగా మ్యూట్ మోడ్‌లో ఉండటం ఏంటో అర్ధంగాక దిక్కులు చూస్తున్నారట కార్యకర్తలు. అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకలాపాలు దాదాపుదా నిలిచిపోయినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.