Off The Record: బీఆర్‌ఎస్‌లో మామిడితోట విందు రాజకీయాలు.. ఎమ్మెల్యేపై తిరుగుబాటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే రాములు నాయక్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌కే చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు గళం విప్పారు. ఎమ్మెల్యే వల్ల తమకు ప్రయోజనం లేదని నినదిస్తున్నారు. వైరా మున్సిపాలిటీగా మారి మూడేళ్లే అయ్యింది. నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాగుతుందని వారు ప్రశ్నిస్తున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయని టాక్. తాము తెలంగాణలో లేమా అని ప్రశ్నిస్తూ ఓ మామిడి తోటలో విందు రాజకీయాలకు కౌన్సిలర్లు తెరతీయడం చర్చగా మారింది. మున్సిపాలిటీలో మొత్తం 20మంది కౌన్సిలర్లు ఉండగా.. వారిలో 18 మంది బీఆర్‌ఎస్ వాళ్లే. తాజా విందు రాజకీయానికి చైర్మన్ సూతకాని జైపాల్ నేతృత్వం వహించారట. ఈ మీటింగ్‌కు ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సహా 18 మంది హాజరు కావడంతో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఛైర్మన్ జైపాల్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం. కౌన్సిల్‌లో .. వైరా నియోజకవర్గంలో పొంగులేటికి వర్గం బలంగానే ఉంటుంది. జైపాల్ త్వరలో పొంగులేటికి ఓపెన్‌గా మద్దతు తెలియజేస్తారని చెబుతున్నారు.
Read Also: Off The Record: కోటంరెడ్డి ఎపిసోడ్‌లో తెలుగు తమ్ముళ్లు ఎందుకు సైలెంట్..?
Also Read
మామిడి తోట విందు సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్‌పైనే ఎక్కువగా చర్చించారట. మున్సిపాలిటీకి ఎమ్మెల్యే నిధులు తీసుకురావడం లేదనేది సభ్యుల ఆరోపణ. ఇక్కడో విచిత్రం ఉంది. జైపాల్ మాదిరే రాముల్ నాయక్ కూడా పొంగులేటి వర్గమే. గత ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థిని కాదని రాములు నాయక్‌ను పోటీ చేయించి గెలిపించారు పొంగులేటి. అయితే పరిణామాలు మారిపోవడంతో రాములు నాయక్.. మాజీ ఎంపీకి దూరంగా ఉంటున్నారు. పొంగులేటిపై పదునైన విమర్శలు చేస్తున్నారు ఎమ్మెల్యే. ఇది కూడా విందు రాజకీయాలకు నాంది పలికిందనే ప్రచారం ఉంది. మున్సిపాలిటీకి వంద కోట్లు తీసుకురావాలని ఆ సమావేశంలో ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు కౌన్సిలర్లు. లేకపోతే సీన్ మారిపోతుందని.. కండువాలు మార్చేస్తామని హెచ్చరిస్తున్నారట. వందకోట్లు అనేది పార్టీ మారడానికి ఒక సాకుగా చూపిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. వెనుక పొంగులేటి ఆశీసులు చూసుకునే ఛైర్మన్, కౌన్సిలర్లు ఈ విధంగా ఎమ్మెల్యేను సవాల్ చేస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే రానున్న రోజుల్లో వైరా రాజకీయం ఇంకా ఆసక్తిగా మారుతుందని లెక్కలేస్తున్నారు.
- Tags
- BRS
- off the record
- telangana
- TRS
- wyra
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!