Off The Record: కేసీఆర్ మారిపోయారా..? ఇక ముందు కూడా ఇలానే ఉంటారా..?
- ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా మారిపోయిన కేసీఆర్..
- పార్టీ నేతలతో సమావేశాలు.. క్యాడర్ తో టచ్ లోకి బీఆర్ఎస్ చీఫ్.. ఇప్పుడు కలిసినట్టు.. గతంలో కూడా ఉంటే.. పరిస్థితులు వేరుగా ఉండేవన్న అభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: బీఆర్ఎస్ చరిత్రలో తొలిసారిగా ఈ విడత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలు చేసిన గాయం పార్టీ అధిష్టానాన్ని ఓవైపు సలుపుతుండగానే… దాని మీద కారం చల్లాయి ఎంపీ ఎలక్షన్స్. పార్టీ పెట్టాక తొలిసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోవడంతో తీవ్ర అంతర్మధనంలో పడ్డారట గులాబీ పెద్దలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తయింది. పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో ముందుకు సాగుతామని ప్రకటించింది అధిష్టానం. ఇక లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయంతో… దిమ్మ తిరిగిపోయిన అగ్ర నాయకత్వం… మరింత లోతుగా విశ్లేషించడం మొదలుపెట్టిందట. దీని మీద పార్టీలో అంతర్గత చర్చలు కూడా గట్టిగానే జరుగుతున్నట్టు తెలిసింది.
Read Also: Off The Record: పీసీసీ చీఫ్ విషయంలో హైకమాండ్‌కు క్లారిటీ వచ్చిందా..?
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కొద్ది రోజులుగా ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ని కలుస్తున్న నేతలు, కార్యకర్తలు ఎవరి దృష్టికి వచ్చిన వివరాలు వారు చెబుతున్నారట. మరోవైపు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలిచి లంచ్ మీటింగ్‌లు పెడుతున్నారు. దాంతో పాటు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వస్తున్న పార్టీ శ్రేణులను కలుస్తున్నారాయన. గులాబీ దళంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేతను కలవాలంటే… అదో తతంగంలా ఉండేదని, అసలు ఎమ్మెల్యేలకు సైతం ఆయన దర్శన భాగ్యం కలగడం అపురూపంగా ఉండేదని, ఇప్పుడు వాతావరణం పూర్తి భిన్నంగా ఉందని మాట్లాడుకుంటున్నారు నాయకులు.
Read Also: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
ఇప్పుడు కలిసినట్టు, మాట్లాడినట్టు గతంలో కూడా మాట్లాడిఉంటే.. పరిస్థితులు వేరుగా ఉండేవన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నట్టు తెలిసింది. సార్.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారని కేడర్ గుసగుసలాడుకుంటోందట. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని పూర్తిగా మారిపోయి ఎలాంటి భేషజాలు లేకుండా అందర్నీ కలిస్తే… పూర్వ వైభవం రావడానికి ఎక్కువ టైం పట్టబోదన్న అభిప్రాయం కేడర్‌లో వ్యక్తం అవుతోందంటున్నారు. తాజాగా ఆర్మూరు, హుజూరాబాద్ నుంచి వచ్చిన పార్టీ నాయకులను కలసి.. వారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఇక ముందు కూడా ఆయన పార్టీ శ్రేణులను ఇలాగే కలుస్తారని అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. మొత్తం మీద కేడర్, లీడర్స్‌తో కేసీఆర్ మీటింగ్‌లు బీఆర్‌ఎస్‌తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అయ్యాయి. అదే టైంలో ఇంకో మాటా గట్టిగానే వినిపిస్తోంది. కేసీఆర్ కలవాలనుకున్నారు, లీడర్స్ కలుస్తారు. కానీ… ఇద్దరి మధ్య శిఖండుల్లా అడ్డుపడే బ్యాచ్‌ని దూరం పెడితేనే వ్యవహారం సవ్యంగా సాగుతుందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఈ మార్పు తాత్కాలికమా? లేక శాశ్వతమా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!