కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని జిల్లాల్లో జనం చెబుతున్నారు.. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తామని కేసీఆర్ తెలిపారు. అందులో అనుమానమే లేదు.. ప్రజలు ఏమి కోల్పోయారో వారికి అర్ధం అయ్యింది.. ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయని పేర్కొన్నారు. పార్టీ కోసం అందరూ కష్టపడి పనిచేయాలి.. అధికారంలోకి రాగానే వాడిని లోపల వేయాలి.. వీడిని లోపల వేయాలని తాము…
కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో ఏమి మారలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల అమలులో వైఫల్యంపై పోరాటం చేయాలని రాజకీయ తీర్మానం చేశామన్నారు. రైతు భరోసా 15 వేలు ఇస్తామని చెప్పారని.. ఇప్పటి వరకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు.