కరుడుగట్టిన నేరగాడికి పనిగట్టుకుని మరీ... పెరోల్ ఇప్పించింది ఎవరు? రౌడీ షీటర్ శ్రీకాంత్‌ను బయటికి తీసుకురావడంలో ఎవరికి ఇంట్రస్ట్ ఉంది? జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరగాడిని పెరోల్ మీద బయటికి తీసుకువచ్చి ఎలాంటి పనులు చేయించాలనుకున్నారు? పోలీస్, పొలిటికల్ పవర్స్ కలిసి అతనికి ఫేవర్ చేయాలనుకున్నాయా? ఇప్పుడీ వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకోబోతోందా? సిఫారసు లేఖలు ఇచ్చిన ఆ శాసనసభ్యులు ఎవరు?