విశాఖ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ కు మెమో జారీ చేశారు నెల్లూరు జైలు సూపరిండెంటెంట్ ... పెరోల్ రద్దుచేసి ఈ నెల 23వ తేదీన విశాఖ సెంట్రల్ జైలుకు శ్రీకాంత్ ను తరలించారు అధికారులు..
అంతా శాఖాహారులే..... కానీ... బుట్టలోని రొయ్యలు మాత్రం మాయం. ప్రస్తుతం రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్‌కు ఈ సామెత సరిగ్గా సరిపోతుందంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఈ కేసుకు సంబంధించి పేర్లు బయటికి వచ్చిన నేతలంతా... మాకు సంబంధం లేదంటే మాకు లేదంటున్నారు. కానీ... పెరోల్ మాత్రం వచ్చింది, రచ్చ అయ్యాక మళ్లీ శ్రీకాంత్‌ని లోపలికి నెట్టారు. కానీ.. ఇక్కడ అసలు దోషులెవరన్నది బిగ్ క్వశ్చన్. ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న, అంతకు ముందు కూడా…
కరుడుగట్టిన నేరగాడికి పనిగట్టుకుని మరీ... పెరోల్ ఇప్పించింది ఎవరు? రౌడీ షీటర్ శ్రీకాంత్‌ను బయటికి తీసుకురావడంలో ఎవరికి ఇంట్రస్ట్ ఉంది? జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరగాడిని పెరోల్ మీద బయటికి తీసుకువచ్చి ఎలాంటి పనులు చేయించాలనుకున్నారు? పోలీస్, పొలిటికల్ పవర్స్ కలిసి అతనికి ఫేవర్ చేయాలనుకున్నాయా? ఇప్పుడీ వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకోబోతోందా? సిఫారసు లేఖలు ఇచ్చిన ఆ శాసనసభ్యులు ఎవరు?
జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఫేస్‌బుక్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.. శ్రీకాంత్ పెరోల్ మంజూరు, రద్దు తరువాత పలు అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అరుణ.. శ్రీకాంత్ ను వాడుకున్న వాళ్లు ఎవ్వరూ ఇప్పుడు నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. శ్రీకాంత్ బాధ పడుతుంటే మీకు ఇష్టం అని అర్థం అవుతుంది.. పరిస్థితి ఇక్కడి వరకు వచ్చాక నేను ఎందుకు నోరు విప్పకూడదు..? అని ప్రశ్నించింది..