Off The Record: మైనంపల్లి, మర్రి రాజశేఖర్రెడ్డి మధ్య సవాళ్ల పర్వం..
- మైనంపల్లి, మర్రి రాజశేఖర్రెడ్డి మధ్య సవాళ్ళ పర్వం..
- చిన్న గొడవతో మొదలై మల్కాజ్‌గిరిలో సెగలు పొగలు..
- దమ్ముంటే మల్కాజ్‌గిరి రమ్మని మైనంపల్లికి బీఆర్‌ఎస్ సవాల్..
- మల్కాజ్‌గిరి చౌరాస్తాలో మైనంపల్లి హన్మంతరావు, ఉద్రిక్తత..
- ఆలయాలకు బోనాల చెక్కుల పంపిణీ దగ్గర మొదలైన వివాదం..
- బీఆర్‌ఎస్ కార్పొరేటర్స్ సీట్లలో కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చున్నారని గొడవ..
- గాల్లోకి కాల్పులకు సిద్ధమైన ఎమ్మెల్యే మర్రి గన్‌మెన్..
- ఎట్నుంచి ఎటు పోతుందోనని మల్కాజ్‌గిరిలో టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి రాజకీయం మండుతోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం తారా స్థాయికి చేరిపోయింది. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరుల దగ్గర మొదలైన గొడవ… చినికి చినికి గాలి వానాగా మారి ప్రకంపనలు రేపుతోంది. ఆ దెబ్బకు మల్కాజిగిరి నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కి సెగలు పుడుతున్నాయి. తాజాగా… అల్వాల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చెలరేగిన ఘర్షణల ప్రభావం మల్కాజిగిరి వరకు పాకడంతో ఇరు పార్టీల నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీట్ పెంచారు. దాని తాలూకు ఉద్రిక్తతలు నియోజకవర్గంలో కొనసాగుతూనే ఉన్నాయి. పైనుంచి కింది స్థాయిదాకా.. ఈ సవాళ్ళ పర్వం నడుస్తూనే ఉంది. దమ్ముంటే మల్కాజిగిరికి రా… అంటూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులకు సవాల్ విసిరారు. స్వీకరించిన కాంగ్రెస్ లీడర్స్ మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్, పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అంతకు ముందు అల్వాల్‌లో జరిగిన ఘటనే దీనికి మూల కారణం అంటున్నారు పరిశీలకులు.
Read Also: Tanya : కెమెరామెన్ తో హీరోయిన్ ఎంగేజ్ మెంట్..
Also Read
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆలయాలకు బోనాల పండుగ సందర్భంగా చెక్కుల పంపిణీ కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అక్కడ కుర్చీలు ఏర్పాటు చేసే క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సరైన స్థానం ఇవ్వలేదని, ఆ సీట్లలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చున్నారంటూ వాగ్వివాదం మొదలై తోపులాటకు దారి తీసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్తపై దాడి చేసినట్టు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మీదికి కూడా వాటర్ బాటిల్ విసిరినట్టు చెబుతున్నారు. అప్రమత్తమైన గన్ మెన్ వెంటనే దానిని అడ్డుకున్నాన్నారని, ఒక దశలో గాల్లోకి కాల్పులకు కూడా సిద్ధమయ్యారని సమాచారం. అయితే… వేగంగా స్పందించిన పోలీసులు రెండు పార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికి సద్దుమణిగినా… తిరిగి రాత్రి సమయంలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఉదయం బీఆర్ఎస్ నేతలు చేసిన ఛాలెంజ్ కు రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్పందించి తన అనుచరులతో మల్కాజిగిరి చౌరస్తాకు వచ్చి సవాల్ విసిరారు. దీంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అతి కష్టం మీద పోలీసులు పరిస్థితిని అదుపు చేయగలిగినా… ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మొదలైన సవాళ్ళ పర్వం ఇంకెంత దూరం వెళ్తుందోనన్న ఆందోళన మాత్రం అలాగే ఉందట నియోజకవర్గంలో.
తాజావార్తలు
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!