Tanya : ఈ నడుమ హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందులోనూ ఎక్కువ ప్రేమ వివాహాలే అవుతున్నాయి. తాజాగా యంగ్ బ్యూటీ తాన్యా రవిచంద్రన్ కూడా ప్రేమలో పడి ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుంది హీరోతోనో నటుడితోనో కాదండోయ్.. ఓ కెమెరామెన్ తో. అవును.. కెమెరామెన్ గౌతమ్ జార్జ్ తో ఆమె కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. చాలా రోజులు సైలెంట్ గా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ ఇంట్లో వారిని ఒప్పించి తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ కిస్ ఇచ్చుకున్న ఫొటోలను తాజాగా పోస్టు చేశారు.
Read Also : Kannappa : రాష్ట్రపతి భవన్ లో కన్నప్ప మూవీ ప్రదర్శన..
త్వరలోనే పెళ్లి ఉంటుందని తెలిపారు. ఈ తాన్య ఎవరో కాదు నటుడు రవిచంద్రన్ కు స్వయానా మనవరాలు. ఆమె తెలుగులో రాజా విక్రమార్క, మెగాస్టార్ చిరంజీవి చేసిన గాడ్ ఫాదర్ లో కీలక పాత్రలు చేసింది. జార్జ్ ప్రస్తుతం వరుస సినిమాలకు కెమెరామెన్ గా చేస్తున్నాడు. లారెన్స్ హీరోగా వస్తున్న బెంజ్ సినిమాకు ఇతనే చేస్తున్నాడు.