Off The Record: ఏపీ హోం మంత్రి రాజకీయంగా ఒంటరి అయ్యారా..?
- ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రి వంగలపూడి అనిత..
- మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి అనే మాటలతో వైసీపీ నేతల ఫైర్..
- అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
- మేకప్ మంత్రి అంటూ చేసిన వ్యాఖ్యల దుమారం..
- అమర్ మాటలపై కింది స్థాయిలో టీడీపీ నిరసనలు..
- మాకేం సంబంధం అన్నట్టు ఎమ్మెల్యేలంతా ఎవరికి వారు..
- ముక్తసరిగా స్పందించిన చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు..
- మూడు రోజులకు రియాక్ట్ అయిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా..
- మంత్రి, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపమే అసలు కారణమా?..
- నాకేంటి అన్నట్టు మంత్రి వ్యవహరిస్తున్నారా?..
- విశాఖ జిల్లాలో మంత్రి ప్రమేయాన్ని ఎమ్మెల్యేలే తగ్గించారా?..
- మమ్మల్ని పట్టించుకోనప్పుడు మేం ఎందుకు రియాక్ట్ అవ్వాలన్న వైఖరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వంగలపూడి అనిత.. ఏపీ హోం శాఖ మంత్రి అండ్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు. గుడివాడ అమర్నాథ్.. మాజీ మంత్రి… అండ్ వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయకర్త. ఈ ఇద్దరు నేతల కేరాఫ్ అడ్రస్ అనకాపల్లి జిల్లానే. రాజకీయంగా టామ్ అండ్ జెర్రీ ఫైటింగే. రెండు పార్టీలకు చెందిన మిగిలిన నేతలు కాస్త అటో ఇటో సంయమనం పాటించినా.. ఈ ఇద్దరిది మాత్రం ఛాన్స్ దొరికితే రప్పా.. రప్పానే..! తాము ప్రతిపక్ష నేతగా.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడే వారు అనిత. ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి అమర్నాథ్ ఘాటుగానే స్పందించే వారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రి అయ్యారు అనిత. అందులోనూ… హోం లాంటి పవర్ ఫుల్ శాఖకు మంత్రి కావడంతో ఆమె మీద అటెన్షన్ పెరిగింది. టీడీపీ అధిష్టానానికి దగ్గరగా ఉండటం, కీలక కమిటీల్లో సభ్యురాలు అవడం వంటి కారణాలతో అనిత ప్రాధాన్యత బాగా పెరిగిందన్నది విస్తృతాభిప్రాయం. అదే సమయంలో హోం మంత్రి రాజకీయంగా చేసే విమర్శలు ఇటీవల ఘాటెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండి పడుతూ ఉంటారు. ఈ క్రమంలో అనిత దూకుడుకు బ్రేకులు వేయాల్సందేనని డిసైడ్ అయ్యారట వైసీపీ లీడర్స్. తమ అధినేత, ఆయన కుటుంబ సభ్యుల పట్ల హోం మంత్రి వాడే భాష సరిగా లేదంటూ ఆమెకు.. ఆ భాషలోనే సమాధానం చెబుతామని హెచ్చరిస్తుంటారు ప్రతిపక్ష నాయకులు చాలామంది.
అయితే… ఆ విషయంలో అందరికంటే ముందుగా కుండబద్దలు కొట్టేశారు మాజీ మంత్రి అమర్నాథ్. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో చోడవరంలో భారీ బైక్ ర్యాలీ చేశారు అమర్నాథ్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాక రేపాయి. జిల్లాలో ఒక మేకప్ మంత్రి ఉన్నారంటూ మొదలుపెట్టి.. మాజీ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మా మేడంను అంత మాట అంటారా అంటూ పాయకరావుపేట టీడీపీ నాయకులు ముందు గళం విప్పారు. ఆ తర్వాత తెలుగు మహిళలు తెరపైకి వచ్చి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. కోడిగుడ్లతో అమర్నాథ్ ఫ్లెక్సీ మీద కొట్టి దిష్టి బొమ్మ దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ… అదంతా దిగువ స్థాయిలోనే. కానీ.. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఏకైక మంత్రిని ఉద్దేశించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు పెద్దగా ఎందుకు రియాక్ట్ అవలేదన్నది బిగ్ క్వశ్చన్. విశాఖ జిల్లాలో టీడీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అయినా ఎమ్మెల్యేల స్థాయిలో రియాక్షన్స్ లేకపోవడానికి కారణాలను వెదుకుతున్నాయి రాజకీయ వర్గాలు. అమర్నాధ్ చోడవరంలో అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కాబట్టి… మీ అభిప్రాయం ఏంటని మీడియా అడిగితే స్థానిక ఎమ్మెల్యే KSNS రాజు స్పందించారు. రాజకీయాల్లో భాష హుందాగా ఉండాలని, అమర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ముక్తసరిగా చెప్పి వదిలేశారు.
Also Read
ఇక మూడు రోజుల తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు. అమర్నాథ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకు మించి మిగతా కూటమి ఎమ్మెల్యేలు ఎవ్వరూ కిక్కురుమనలేదు. మాట్లాడిన ఇద్దరూ కూడా ఏదో తప్పదన్నట్టు స్పందించారన్న అభిప్రాయం ఉంది. మామూలుగా అయితే.. రాష్ట్ర హోం మంత్రి, అందునా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిని ఉద్దేశించి ఆ స్థాయిలో మాజీ మంత్రి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎదురు దాడి నెక్స్ట్ లెవల్లో ఉండాలి. పార్టీ నాయకత్వం మొత్తం మూకుమ్మడిగా విరుచుకుపడితోందా అనే భావన ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి బలంగా వెళ్ళాలి. కానీ ఇక్కడ అలాంటివేం జరక్కపోగా.. తప్పదన్నట్టుగా ఇద్దరు స్పందించారు. మిగతా వాళ్ళంతా మాకేం సంబంధం అన్నట్టుగా ఎందుకు ఉన్నారంటూ ఆరా తీస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. కూటమిగా కాకపోయినా కనీసం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలుగా అయినా మాజీ మంత్రికి గట్టి కౌంటర్ ఇవ్వవచ్చుగానీ.. ఆ పని కూడా చేయలేకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏవైనా ఉన్నాయా అంటూ ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ పరిస్థితికి మంత్రి, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణం అన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. అనితతో పోలిస్తే ఇక్కడ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలంతా రాజకీయంగా సీనియర్లు. అలాంటి చాలా మందికి అవకాశాలు ఆలస్యంగా వస్తే.. అనిత దశాబ్ద కాలంలోనే రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు.
కేబినెట్‌తో పాటు హైకమాండ్ దగ్గర లభిస్తున్న ప్రయారిటీ కారణంగా ఆమె జిల్లా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునే విషయంలో కాస్త అలసత్వం ప్రదర్శించారని, ఇంకా చెప్పాలంటే నాకేంటి అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. విశాఖ సిటీ శాసనసభ్యులు అయితే స్థానిక వ్యవహారాల్లో మంత్రిగా అనిత జోక్యాన్ని అస్సలు అంగీకరించడం లేదన్న గుసగుసలు ఉన్నాయి. అందుకే శాఖాపరమైన అంశాల మీద తప్ప విశాఖ నగరానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె ప్రమేయం బాగా తగ్గిందని అంటున్నారు. ఇక్కడ తగ్గింది అనడం కంటే తగ్గించారనడమే కరెక్ట్ అన్నది చాలామంది ఫీలింగ్. ఇక అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలతోనూ దాదాపు ఇదే వ్యవహార శైలి ఉందట. జిల్లాకు సంబంధించిన అంశాల మీద ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టడంగానీ, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయాలు అమలు చేయడం కానీ లేదట. అన్నింటికి కేరాఫ్ హైకమాండ్ అంటున్నారని.. అలాంటప్పుడు ఆమెను ఎవరో ఏదో అంటే.. మేం రాజకీయ ఎదురుదాడికి ఎందుకు వెళ్ళాలని ఓ సీనియర్ నేత అన్నారట. దీంతో.. ఉమ్మడి విశాఖ జిల్లాలో హోం మంత్రి ఒంటరి అయ్యారా అన్న సందేహాలు వస్తున్నాయట పరిశీలకులకు. ఈ ఎపిసోడ్ తర్వాత అది క్లియర్‌గా కనిపిస్తోందన్నది వాళ్ళ ఒపీనియన్.
తాజావార్తలు
-
Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
-
Anirudh: సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టిన అనిరుధ్.. ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో మ్యాజిక్
-
DK: ‘నన్ను వదిలేసి ఫస్ట్ టైం చేస్తున్నావ్’.. సమంత ఈవెంట్లో రాజ్‌కు డీ.కే. కౌంటర్!
-
India A vs Sri Lanka A: మొదట తిలక్ వర్మ.. తర్వాత వైభవ్ సూర్యవంశీ.. గందరగోళంగా భారత్-శ్రీలంక మ్యాచ్
-
Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!