బందరు పొలిటికల్ వార్ పీక్స్‌లో ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీట్ అంతకంతకూ పెరుగుతోంది. మేటర్ రాజకీయాలు దాటి వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు కొల్లు రవీంద్ర. ఇక 2024లో కొల్లు మంత్రి అయ్యాక పరిస్థితులు తిరగబడ్డాయి.