Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Kcr Target Politics

Off The Record: కేసీఆర్‌ టార్గెట్‌గా సరికొత్త రాజకీయం..! రక్తి కడుతున్న ఆ పాలిటిక్స్‌ ఏంటి..?

Published Date :March 21, 2025 , 10:00 pm
By Sudhakar Ravula
  • కేసీఆర్‌ టార్గెట్‌గా గజ్వేల్‌లో కొత్త రాజకీయం..
  • రెగ్యులర్‌గా అసెంబ్లీకి అటెండ్‌ అవని కేసీఆర్‌..
  • ఇప్పటికి రెండు రోజులు మాత్రమే సభకు కేసీఆర్‌..
  • ఈనెల 18న కేసీఆర్‌కు మల్లన్నసాగర్‌ నిర్వాసితుల లేఖ..
  • అసెంబ్లీలో మా సమస్యపై మాట్లాడమని వినతి..
  • ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ని ముట్టడిస్తామని వార్నింగ్‌..
  • గజ్వేల్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ని ముట్టడించిన బీజేపీ..
Off The Record: కేసీఆర్‌ టార్గెట్‌గా సరికొత్త రాజకీయం..! రక్తి కడుతున్న ఆ పాలిటిక్స్‌ ఏంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే. కేసీఆర్‌ అంటే… ఎవరికి తెలియదని, ఆయన గురించి అంత ఉపోద్ఘాతం అవసరమా అనుకుంటున్నారా? యస్… మీరనుకునేది కరెక్టేగానీ… అసలు మేటరంతా అక్కడే ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ ప్రభావమే ఇప్పుడు కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లో కనిపిస్తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ గెలిచినా… పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన రెగ్యులర్‌గా అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో.. ఫస్ట్‌టైం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజు, ఇటీవలి బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్‌ ప్రసంగానికి… కేవలం రెండంటే రెండే రోజులు సభలోకి వెళ్ళారాయన. దీంతో… ఇప్పడు కేసీఆర్ టార్గెట్‌గా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. అధికార కాంగ్రెస్‌తో పాటు, బీజేపీ నాయకులు కూడా మాజీ సీఎంని లక్ష్యం చేసుకుని సరికొత్త రాజకీయం మొదలుపెట్టారట.

మల్లన్నసాగర్ నిర్వాసితులు ఈ నెల 18న కేసీఆర్ కి బహిరంగలేఖ రాశారు. తమ 14 ముంపు గ్రామాల సమస్యలపై గజ్వేల్ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలో కేసీఆర్‌ మాట్లాడాలన్నది ఆ లేఖ సారాంశం. సీఎంగా ఉన్నప్పుడు తమకిఇచ్చిన హామీలపై ఇప్పటికైనా అసెంబ్లీలో గళమెత్తాలని కోరారు నిర్వాసితులు. లేకపోతే మరుసటి రోజు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌ని ముట్టడించి అక్కడే టెంట్ వేసుకుని కూర్చుంటామని, సమస్యపరిష్కారం అయ్యే వరకు ఇక్కడే ఉండి వంట వార్పు నిర్వహిస్తామని హెచ్చరించారు. దాంతో 19న పోలీసులు కేసీఆర్‌ ఫామ్ హౌస్‌ దగ్గర భద్రత పెంచారు. కానీ… మల్లన్నసాగర్ నిర్వాసితులు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అంతా. అయితే అదే రోజున బీజేపీ నాయకులు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ని ముట్టడించారు. గేట్‌కు టు లెట్‌ బోర్డు పెట్టడంతో పాటు వాంటెడ్ ఎమ్మెల్యే అంటూ తగిలించారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచిన కేసీఆర్ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని, క్యాంప్ ఆఫీస్ ఖాళీగా ఉండటం, ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు బీజేపీ నాయకులు.

ఇక కాంగ్రెస్ నేతలైతే.. అసెంబ్లీకి రాని కేసీఆర్ పై గవర్నర్ చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్ర ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి రాజ్ భవన్ వరకు 90 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలన్నది వాళ్ళ టార్గెట్‌. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్.. నియోజకవర్గ బాగోగులు పట్టించుకోవాలని వారు డిమాండ్ చేశారు పాదయాత్ర చేస్తున్న నాయకులు. అసలు గజ్వేల్‌కి ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అన్న అనుమానం కలుగుతోందని, కేసీఆర్ తమ సమస్యలు ఎప్పుడు వింటారా అంటూ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని కాస్త సెటైరిక్‌గానే చెబుతున్నారు కాంగ్రెస్‌ లీడర్స్‌. నాలుగు రోజుల్లో పాదయాత్ర రాజ్ భవన్ చేరుకున్నా తమ ఎమ్మెల్యేని అసెంబ్లీకి రప్పించేలా చర్యలు తీసుకోమని వినతి పత్రం ఇస్తామంటున్నారు గజ్వేల్‌ కాంగ్రెస్‌ లీడర్స్‌. బీఆర్ఎస్ ఓడిపోయిన కొత్తల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మిస్సింగ్ అంటూ నియోజకవర్గంలో పలు చోట్ల పోస్టర్స్‌ వేశారు. అయితే ఈ తాజా ఎపిసోడ్ పై బీఆర్ఎస్ నాయకులు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయని చెబుతున్నారు. అభివృద్దిలో నియోజకవర్గాన్ని కేసీఆర్ 50 ఏళ్ల ముందుకు తీసుకెళ్లారని… కళ్లుండి చూడలేని కబోదులకు ఈ విషయాలు అర్థం కావని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కానీ, బీజేపీ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు కానీ ఈ ఏడాదిలో గజ్వేల్ లో ఏం అభివృద్ది చేశారో చెబుతారా అంటూ సవాల్ విసురుతున్నారు బీఆర్ఎస్ లీడర్స్‌. ఇలా గజ్వేల్ లో కేసీఆర్ టార్గెట్‌గా మొదలైన సరికొత్త రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • congress
  • KCR Target Politics
  • Mallanna Sagar

తాజావార్తలు

  • Muse Spark: AIలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రయోగం.. గూగుల్‌, ఓపెన్‌ఏఐకు ‘మ్యూస్ స్పార్క్’ సవాల్‌..

  • David Miller: “ఓటమికి కారణం నేనే”.. స్టేడియంలోనే ఏడ్చేసిన డేవిడ్ మిల్లర్.. హృదయాలను గెలిచిన అక్షర్!

  • Indian Bank Vacancy 2026: ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ప్రారంభం.. భారీ జీతం

  • Stock Market: ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • Nara Lokesh: ఇది తెలుగుదేశం 3.0 వర్షన్.. పైరవీలతో పనిలేదు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions